East Godavari: వేసవిలో దొంగతనాల పట్ల జాగ్రత్త గ్రామస్తులకు పోలీసుల కీలక సూచనలు
East Godavari: తూర్పుగోదావరి జిల్లా గాదరాడ గ్రామంలో పోలీసుల అవగాహన సదస్సు. మహిళా భద్రత, రోడ్డు నిబంధనలు, గంజాయి నిర్మూలనపై ప్రజలకు సూచనలు.
East Godavari: వేసవిలో దొంగతనాల పట్ల జాగ్రత్త గ్రామస్తులకు పోలీసుల కీలక సూచనలు
East Godavari: తూర్పుగోదావరి జిల్లా యస్ పి ఉత్తర్వుల మేరకు, కోరుకొండ నార్త్ జోన్ డీఎస్పీ సీచ్ . జీవన ఆధ్వర్యంలో, కోరుకొండ సర్కిల్ పరిధిలోనిసీఐ,ఎస్సైలు మరియు ఈగిల్ టీం ఎస్సై కలిసి కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో ప్రజలకుపలు భద్రత అంశాలు ఫై అవగాహన కార్యక్రమం కల్పించారు.
ఈ కార్యక్రమంలో రోడ్డు భద్రత మహిళల భద్రత మరియు ,సీసీ కెమెరాల ఆవశ్యకత, వేసవికాలం దృష్ట్యా ఆరు బయట నిద్రించేటప్పుడు ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని దొంగతనం జరిగే అవకాశం ఉన్నది మీ విలువైన వస్తువును జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి,గంజాయి వినియోగం వల్ల కలిగే హానికర ప్రభావాలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నియమాలను పాటించడం, హెల్మెట్ ధరించడం, మద్యం సేవించి వాహనం నడపకూడదని సూచించారు. అలాగే మహిళల భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు అత్యవసర సమయంలో పోలీసులను ఎలా సంప్రదించాలో వివరించారు. గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగం వల్ల వ్యక్తిగతంగా మరియు సమాజానికి కలిగే నష్టాలను వివరించి, అవగాహనా కల్పించారు .
అదేవిధంగా, పోలీసు సిబ్బందిని నాలుగు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నాకాబందీ నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 200 వాహనాలను తనిఖీ చేయగా, నంబర్ ప్లేట్లు లేని మరియు సరైన పత్రాలు లేని 20 వాహనాలను గుర్తించి .చట్టపరమైన చర్యలు తీసుకొన్నారు .భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు కొనసాగుతాయని పోలీసు అధికారులు తెలిపారు.




