పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని వామపక్షాల ఆధ్వర్యంలో రాస్తారోకో

గోదావరి జిల్లా ప్రకాశం చౌక్ సెంటర్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ధరల భారాలకు వ్యతిరేకంగా వామపక్షాల ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో జరిగింది. మన జిల్లా గ్యాస్ నిక్షేపాలను గుజరాత్‌కు తరలిస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి జె ఎన్ వి గోపాలన్ మండిపడ్డారు.

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM
Published on: 9 Jun 2026 4:21 PM IST
పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని వామపక్షాల ఆధ్వర్యంలో రాస్తారోకో
X

కేంద్రంలో మోడీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు ప్రజలపై మోపుతున్న భారాలకు నిరసనగా వామపక్షాలు ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు ప్రకాశం చౌక్ సెంటర్లో వామపక్షాల ఆధ్వర్యంలో రాస్తారోకో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభకు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జక్కం శెట్టి సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ఈ సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి జె ఎన్ వి గోపాలన్ మాట్లాడుత మన గోదావరి జిల్లాలో గ్యాస్ నిక్షేపాలు పుష్కలంగా ఉన్న గ్యాస్ గుజరాత్ కి తరలించి అంబానీ ఆస్తులను మోడీ పెంచుతున్నారని తెలిపారు. అదే మన గ్యాస్ నిక్షేపాలు మనకిక్కడ ఉపయోగిస్తే 100 రూపాయలకే గ్యాస్ బండ అందించవచ్చు అని అన్నారు.

పెట్రోలు గ్యాస్ ధరలు అదుపు చేయడంలో మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యారన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారాల ఉపసంహరించకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల మీద భారాలు విపరీతంగా పెరిగాయని విమర్శించారు. పేద మధ్యతరగతి ప్రజలు పెరిగిన ధరలకు తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. కార్పొరేట్ వ్యక్తుల కనుసన్నలో మోడీ ప్రభుత్వం పనిచేస్తుందని దుయ్యబట్టారు. నిత్యవసర వస్తువు ధరలు కేంద్ర ప్రభుత్వం విపరీతంగా భారాలు వేస్తున్న ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కూటమి ప్రభుత్వం తమకేమీ పట్టనట్టు వ్యవహరించడం దారుణం అన్నారు. తక్షణమే పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని అన్నారు.

ఈ సభలో సిపిఐ జిల్లా సమితి నాయకులు చెల్ల బోయిన రంగారావు. ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు దండు శ్రీనివాసరాజు ఎం సిపిఐ యు నాయకులు కే మహంకాళి మాట్లాడుతు మోడీ అధికారంలోకి రాకముందు ధరలు తగ్గిస్తానని ప్రజలపై భారాలు వెయ్యనని చెప్పి అధికారంలోకి వచ్చాక ప్రజలపై మోయలేని భారాలను మోపుతున్నారు అన్నారు. మోడీ ప్రజలకు ఖర్చులు తగ్గించుకొని చెప్తూ ఆయన మాత్రం విదేశీ ప్రయాణాలు విలాసవంతమైన వస్తువులకు ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు రానున్న రోజుల్లో ప్రజలతో ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సిపిఎం జిల్లా నాయకులు. ఎ రవి. కే క్రాంతి బాబు. మాట్లాడుతు మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్యులపై భారాల మోపి కార్పొరేట్లకు కోట్ల సంపదను కూడబెడుతున్నారన్నారు ప్రజలు ఒకపక్క నిత్యవసర వస్తువులు ధరలు సామాన్యుడికి అందుబాటులో లేని పరిస్థితి ఏర్పడిందన్నారు దీనికి కారణం మోడీ అమలు చేస్తున్న కార్పొరేట్ల అనుకూల విధానాలే కారణం అన్నారు. ఈ కార్యక్రమంలో జుత్తుగా నరసింహ మూర్తి. ఎం వైకుంఠరావు. ఇంజే టి శ్రీనివాస్. చె ల్ల బోయిన వెంకటేశ్వరరావు వడుగు వెంకటేశ్వరరావు డి త్రిమూర్తులు వరలక్ష్మి వెంకటేశ్వరరావు కే వెంకటపతి రాజు. తదితరులు పాల్గొన్నారు.

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM

Next Story