పాదయాత్ర ఎప్పుడో చెప్పేసిన జగన్

YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని, వచ్చే ఏడాది తన పాదయాత్ర ఉంటుందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజమండ్రి నేతలతో అన్నారు.

Gagan kumar
Published on: 19 Aug 2026 5:34 PM IST
YS Jagan
X

పాదయాత్ర ఎప్పుడో చెప్పేసిన జగన్

YS Jagan: రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ఎంతో వ్యూహాత్మకంగా ఎదుర్కొని, గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ భేటీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ వైఫల్యాలు , భవిష్యత్తు కార్యాచరణపై జగన్ తీవ్రస్థాయిలో స్పందించారు.

కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని జగన్ విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారిపోయాయని, ఇసుక, మట్టి, మద్యం మాఫియాలు విచ్చలవిడిగా చెలరేగిపోతున్నాయని ఆరోపించారు. రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంక హత్య ఉదంతాన్ని ప్రస్తావిస్తూ, ఈ కేసుకు సంబంధించి వాస్తవాలను కప్పిపుచ్చేందుకు మరియు నీరుగార్చేందుకు అధికార వర్గాలు కుమ్మక్కై ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు.

మరో ఏడాదిలో తన పాదయాత్ర ప్రారంభం కానుందని, ఆ తర్వాత ఏడాది ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేస్తూ కేడర్‌లో కొత్త జోష్ నింపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయం మనదే. నిత్యం ప్రజలతో మమేకమై పనిచేస్తూ, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి. ఎంతటి ఒత్తిడి ఎదురైనా వెనుకంజ వేయకుండా సమష్టిగా పోరాడాలి అని జగన్ కేడర్‌ను ఉత్సాహపరిచారు.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story