Municipal Elections 2026: పుంగనూరులో చెలరేగిన తీవ్ర ఉద్రిక్తత: మున్సిపల్ నామినేషన్ల వేళ టీడీపీ-వైసీపీ రణరంగం!

Municipal Elections 2026: అన్నమయ్య జిల్లా పుంగనూరులో మున్సిపల్ నామినేషన్ల వేళ తీవ్ర ఉద్రిక్తత. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య రాళ్ల దాడి, పలు వాహనాలు ధ్వంసం, నేతలకు గాయాలు.

Arun Chilukuri
Published on: 16 Oct 2026 11:59 AM IST
Municipal Elections 2026
X

Municipal Elections 2026: పుంగనూరులో చెలరేగిన తీవ్ర ఉద్రిక్తత: మున్సిపల్ నామినేషన్ల వేళ టీడీపీ-వైసీపీ రణరంగం!

Municipal Elections 2026: అన్నమయ్య జిల్లా పుంగనూరులో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తొలిరోజే తీవ్ర రసాభాసగా మారింది. నామినేషన్లు వేసేందుకు వచ్చిన తెలుగుదేశం (TDP), వైఎస్సార్ కాంగ్రెస్ (YSRCP) పార్టీల శ్రేణులు పరస్పరం ఘర్షణకు దిగడంతో ఆ ప్రాంతం యుద్ధరంగాన్ని తలపించింది. ఇరువర్గాలు విచక్షణారహితంగా రాళ్ల దాడికి పాల్పడటంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

మున్సిపల్ ఎన్నికల నామినేషన్‌ దాఖలు చేసేందుకు టీడీపీ, వైసీపీ నేతలు ఒకే సమయంలో రావడంతో ఇరువర్గాల మధ్య మాటమాట పెరిగి ఘర్షణకు దారితీసింది.

పరస్పరం చేసుకున్న రాళ్ల దాడిలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘర్షణలో పలు వాహనాల అద్దాలు పగిలి పూర్తిగా ధ్వంసమయ్యాయి.

పరిస్థితి చేజారిపోతుండటంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం పుంగనూరు పట్టణంలో అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.