రైతులకు సాగునీరే లక్ష్యం: కేశనపల్లి ఇరిగేషన్ కెనాల్ ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్

Razole: మలికిపురం మండలంలో ప్రతిపాదిత కేశనపల్లి ఇరిగేషన్ కెనాల్ ప్రాజెక్టును రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పరిశీలించారు. రైతులకు సాగునీరు అందించేలా పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

PRABHU, RAZOLE
Published on: 30 April 2026 7:03 AM IST
రైతులకు సాగునీరే లక్ష్యం: కేశనపల్లి ఇరిగేషన్ కెనాల్ ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్
X

మలికిపురం: మలికిపురం మండలం లక్కవరం గ్రామం లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నుంచి గూడపల్లి-2 కెనాల్ మార్గంగా కేశనపల్లి వరకు ప్రతిపాదిత కేశనపల్లి ఇరిగేషన్ కెనాల్ ప్రాజెక్టుపై రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ అధికారులతో పాటు స్థానిక రైతులు, కూటమి నాయకులతో కలిసి ప్రాజెక్టు భూసేకరణ, నీటి సరఫరా సామర్థ్యం, కాలువ మార్గంలోని అడ్డంకులు వంటి అంశాలపై ఎమ్మెల్యే సమీక్షించారు. రైతులకు తక్షణ ప్రయోజనం చేకూరే విధంగా పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.

అలాగే, కాలువ నిర్మాణం పూర్తయితే ప్రాంతంలోని వ్యవసాయ భూములకు సమృద్ధిగా నీటి సరఫరా జరిగి, రైతులకు మేలు జరుగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించి, రైతులకు మేలు చేకూరే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story