Sathakodu: రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య.. గోనె సంచిలో కట్టి నీటిలో పడేసిన వైనం!

Sathakodu: మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలం శతకోడులో ఘోరం జరిగింది. భూ వివాదం నేపథ్యంలో గుంటూరుకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రవికుమార్ దారుణ హత్యకు గురయ్యారు.

Srikanth Singam, Markapur
Published on: 11 Jun 2026 6:39 AM IST
Sathakodu: రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య.. గోనె సంచిలో కట్టి నీటిలో పడేసిన వైనం!
X

మార్కాపురం జిల్లా, పుల్లలచెరువు: పుల్లలచెరువు మండలం శతకోడు గ్రామ పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి రవికుమార్ దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు గుంటూరు జిల్లా వడ్డేశ్వరం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

భూ వివాదానికి సంబంధించి రవికుమార్ శతకోడు గ్రామంలోని పొలానికి వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది హత్య అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి బండరాళ్లతో కట్టి నీటిలో పడేశారు.

స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. భూ వివాదమే హత్యకు కారణమా లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur

Next Story