Sardar Gouthu Latchanna: స్మరించుకున్న సర్దార్.. సోంపేటలో వర్ధంతి వేడుకలు

Sardar Gouthu Latchanna: స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న 19వ వర్ధంతి సోంపేటలో ఘనంగా నిర్వహణ.

G.RAMBABU, SOMPET
Published on: 19 April 2026 1:52 PM IST
Sardar Gouthu Latchanna
X

Sardar Gouthu Latchanna: స్మరించుకున్న సర్దార్.. సోంపేటలో వర్ధంతి వేడుకలు

Sompeta: ప్రజాహృదయాల్లో చిరస్థాయిగా సర్దార్ లచ్చన్న… సోంపేటలో ఘనంగా 19వ వర్ధంతి ప్రజాసేవకు ప్రతీకగా నిలిచిన స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న గారి 19వ వర్ధంతి సందర్భంగా సోంపేటలోని సర్దార్ ఘాట్ వద్ద ఘనంగా నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఆయన విగ్రహానికి మాజీ మంత్రివర్యులు, ఆయన కుమారుడు గౌతు శ్యాంసుందర్ శివాజీ , గౌతు విజయమ్మతో కలిసి పుష్పాంజలి ఘటించి తండ్రి సేవలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, లచ్చన్న ప్రజల కోసం చేసిన త్యాగాలు, నిస్వార్థ సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమని, ఆయన చూపిన ప్రజాహిత మార్గం అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఆయన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు.

కార్యక్రమంలో సోంపేట కోదండరామ ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ బీన ఆనందరావు, మండల ఉపాధ్యక్షులు పొందూరు రాజు, జిల్లా కళింగ కామటి సంఘం అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు చిత్రాడ శేఖర్ శ్రీను, మాజీ ఉప సర్పంచ్ బీన ఈశ్వరరావు తదితరులు పాల్గొని సర్దార్ లచ్చన్న గారి సేవలను స్మరించారు.

అలాగే కార్యకర్తలు, అభిమానులు, మాజీ వార్డ్ సభ్యులు, మాజీ సర్పంచ్‌లు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున హాజరై పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సర్దార్ లచ్చన్న గారి ఆశయాలు సమాజానికి దిక్సూచిగా నిలుస్తాయని, ఆయన స్ఫూర్తితో ప్రజాసేవను ముందుకు తీసుకెళ్లాలని వక్తలు పిలుపునిచ్చారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET

Next Story