Bhadradri: హెల్మెట్ లేకపోతే రిస్కే.. ఆర్టీవో వెంకటరమణ హెచ్చరిక!

Bhadradri: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు రవాణా శాఖ ఆధ్వర్యంలో 'అరైవ్ అలైవ్' రహదారి భద్రతా వారోత్సవాలు ప్రారంభమయ్యాయి.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 15 April 2026 1:46 PM IST
Bhadradri
X

Bhadradri: హెల్మెట్ లేకపోతే రిస్కే.. ఆర్టీవో వెంకటరమణ హెచ్చరిక!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కొత్తగూడెంలో రోడ్డు రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత అవగాహన బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన ఆర్టీవో వెంకటరమణ. ప్రకాశం స్టేడియం నుండి ఓల్డ్ డిపో వరకు ర్యాలీని నిర్వహించారు.

ఈసందర్భంగా ఆర్టీవో వెంకటరమణ మాట్లాడుతూ..

తెలంగాణ ప్రభుత్వం 99 రోజుల 'ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక'లో భాగంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ఏప్రిల్ 13 నుండి 18 వరకు "అరైవ్ అలైవ్" అనే ప్రత్యేక రహదారి భద్రతా వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హెల్మెట్ ధరించి బైక్ లు నడపాలని, త్రిబుల్ రైడింగ్ రాష్ డ్రైవింగ్ చేయవద్దని, వాహనదారులకు అవగాహన కల్పించడం ప్రధాన ఉద్దేశం అన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదన్నారు. కార్ డ్రైవింగ్ చేసే వారు సీట్ బెల్ట్ ధరించాలన్నారు. ఆటోలో ముగ్గురికి మించి ప్యాసింజర్లను ఎక్కించుకోవద్దని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దని హెచ్చరించారు. ఈనెల 18 వరకు రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు, రోడ్డు భద్రతపై భద్రతపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

ఈకార్యక్రమంలో ఎం.వి.ఐ మనోహర్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, 1టౌన్ సీఐ కరుణాకర్, రవాణా శాఖ అధికారులతో పాటు, పోలీస్ డిపార్ట్మెంట్ ,6వ బెటాలియన్ పోలీసులు, ఆర్టిసి అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story