Sundipenta: ప్రభుత్వ గృహాల విక్రయం.. నేలమట్టం చేస్తున్న దళారులు!

Sundipenta: నంద్యాల జిల్లా సుండిపెంటలో జలవనరుల శాఖ వసతి గృహాలను దళారులు లక్షలాది రూపాయలకు విక్రయిస్తూ నేలమట్టం చేస్తున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 18 April 2026 7:57 PM IST
Sundipenta
X

Sundipenta: ప్రభుత్వ గృహాల విక్రయం.. నేలమట్టం చేస్తున్న దళారులు!

Sundipenta: కలెక్టర్ గారు నేలమట్టం అవుతున్న గృహాలను ఆపండి.లక్షల్లో చేతులు మారుతున్న ప్రభుత్వ గృహాలు.కాసుల పంట పండిస్తున్న దళారులు. నిబంధనలకు విరుద్ధంగా నేలమట్టం చేస్తున్న కొనుగోలుదారులు.చోద్యం చూస్తున్న ఇరిగేషన్ శాఖ అధికారులు.సర్వేలో నకిలీ యజమానుల పేర్లు నమోదు. కలెక్టర్ గారు సుండి పెంట గ్రామంలో నేలమట్టమవుతున్న జల వనరుల శాఖ వసతి గృహాలను ఆపండి. కాలనీలో జల వనరుల శాఖ వసతి గృహాలు లక్షలాది రూపాయల్లో విక్రయాలు జోరుగా జరుగుతున్నాయి.

సుండి పెంట గ్రామంలో అగ్నిమాపక శాఖ కార్యాలయం సమీపంలో డి టైపు 102 నెంబర్ కలిగిన ప్రభుత్వ గృహాన్ని నేలమట్టం చేశారు.ప్రభుత్వ గృహాలు క్రయవిక్రయాలు జోరుగా మధ్య దళారుల కను సన్నల్లో జరుగుతున్నాయి. కొనుగోలు దారులు గృహాలను నేలమట్టం చేస్తూ బహుళ అంతస్తుల నిర్మిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ అధికారులకు సవాలు విసురుతున్నారు.

జల వనరుల శాఖ అధికారులు సర్వేలు నిర్వహిస్తుంటే నకిలీ పేర్లు నమోదు చేయించుకుంటూ నిబంధనలకు తుట్లు పొడుస్తున్నారు. నేలమట్టం చేస్తున్న కొనుగోలుదారులు అధికారులకు తాము ముడుపులు ముట్ట చెప్పామని ప్రచారం చేసుకోవడం కోసమెరుపు. నేలమట్టం చేస్తున్న కొనుగోలు దారులపై జలవనుల శాఖ అధికారులు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని చర్చనీయాంశంగా మారింది.

అధికారుల వైఫల్యం లేకుంటే నిర్మాణాలను ఎందుకు నిలుపుదల చేయడం లేదన్నది విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేలమట్టం చేస్తున్న గృహాలను తక్షణమే జిల్లా కలెక్టర్ మరియు అధికారులు స్పందించి కొనుగోలు దారులపై చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తేనే తప్ప గృహాల నేలమట్టం నిలిచిపోయే పరిస్థితి ఉంటుందని కాలనీవాసులు కోరుతున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story