Sajjala Ramakrishna Reddy: డీజిల్ తీసుకురాలేని వాడు గూగుల్ డేటా సెంటర్ తెస్తాడా?

Sajjala Ramakrishna Reddy: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరతపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కూటమి ప్రభుత్వాన్ని విమర్శించారు. కేవలం అమరావతి ప్రాంతానికే ఇంధనం ఇవ్వాలని లేఖ రాయడాన్ని తప్పుబట్టారు.

Arun Chilukuri
Published on: 28 April 2026 4:13 PM IST
Sajjala Ramakrishna Reddy
X

Sajjala Ramakrishna Reddy: డీజిల్ తీసుకురాలేని వాడు గూగుల్ డేటా సెంటర్ తెస్తాడా?

Sajjala Ramakrishna Reddy: ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పెట్రోల్, డీజిల్ సంక్షోభంపై వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? లేక నిద్ర నటిస్తుందా? అని ఆయన ప్రశ్నించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన, చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని మండిపడ్డారు.

పెట్రోల్ సరఫరాపై పౌర సరఫరాల శాఖ ఆయిల్ కంపెనీలకు రాసిన లేఖపై సజ్జల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. "కేవలం అమరావతి ప్రాంతంలోనే కొరత లేకుండా చూడాలని లేఖ రాయడం ఏంటి? ఇది పౌర సరఫరాల శాఖనా లేక అమరావతి సరఫరాల శాఖనా?" అని ఎద్దేవా చేశారు. కేంద్ర సెక్రటరీ సప్లై బాగుందని చెబుతున్నా, ఏపీలో మాత్రం కొరత ఉండటం వెనుక బ్లాక్ మార్కెట్ దందా ఉందని, అడ్డంగా దోచుకుంటున్నారని ఆరోపించారు.

జగన్ తెచ్చిన ప్రాజెక్టులకే కలరింగ్!

గూగుల్ డేటా సెంటర్ వంటి ప్రాజెక్టులు జగన్ మోహన్ రెడ్డి హయాంలోనే అదానీ ద్వారా ఖరారయ్యాయని సజ్జల గుర్తు చేశారు. "కనీసం డీజిల్, పెట్రోల్ తీసుకురాలేని ఈ ప్రభుత్వం.. పరిశ్రమలు ఏం తెస్తుంది? గూగుల్ డేటా సెంటర్ ఏం తెస్తుంది?" అంటూ ప్రశ్నించారు.

రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై సజ్జల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ మట్టి రవాణాను ప్రశ్నించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే గణేష్‌పై టీడీపీ నేతలు దాడి చేయడం దుర్మార్గమన్నారు. టోల్ గేట్ సిబ్బందిపై దాడులు చేసినా, ఎస్పీ ఆఫీసులకు వెళ్లి గొడవలు చేస్తున్న కూటమి ఎమ్మెల్యేలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.

"ఏపీలో ప్రభుత్వం అనేది లేదు.. ఇది ప్రజలకు పట్టిన పీడ" అని సజ్జల వ్యాఖ్యానించారు. గవర్నర్ పాలన ఉన్నా అధికారులు పద్ధతిగా పని చేసేవారని, చంద్రబాబు హయాంలో పాలన అస్తవ్యస్తంగా మారిందని విమర్శించారు. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడులో లేని ఇంధన సమస్య ఏపీలోనే ఎందుకు ఉందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story