Atmakur: పశ్చిమ ద్వారం వద్ద భారీ నందీశ్వరుడి రాతి విగ్రహం ఆవిష్కరణ!

Atmakur:సప్త నది సంగమేశ్వర క్షేత్రం పశ్చిమ ద్వారం వద్ద 5 టన్నుల భారీ నందీశ్వరుడు, లలితా దేవి విగ్రహాలను ప్రతిష్టించారు. వర్షాభావం వల్ల జలాధివాసం ఆలస్యమైంది.

M Satya Peter, Atmakur (Karnool)
Updated on: 23 July 2026 11:45 PM IST
Atmakur
X

Atmakur: పశ్చిమ ద్వారం వద్ద భారీ నందీశ్వరుడి రాతి విగ్రహం ఆవిష్కరణ!

ఆత్మకూరు: దేశంలోనే కాకుండా భూగోళంపై ఎక్కడా సృష్టించబడినట్టి ఏడు నదులు ఒకే చోట సంఘమించే హరుదైన పురాణ ఇతిహాస, చారిత్రక నేపద్యమున్న ఏకైక క్షేత్రం.. తీర్థం సప్తనది సంగమేశ్వరం.భూమికి నాభి స్థానం శ్రీశైలం క్షేత్రం అయితే.. ఆ క్షేత్ర నీడ సప్త నది సంగమేశ్వర ఆలయంపై పరుచుకోవడం ఒక గొప్ప విశేషం.

ఈ కలియుగంలో కృష్ణవేణి జలాధివాసంలోకి సంగమేశ్వరుడు ఈ ఏడాది ఆలస్యం అవుతున్నాడు. ఏరు ముందా.. ఏకాదశి ముందా అనే భక్తుల నానుడి ప్రకారం ఈసారి ఏకాదశి పర్వదినమే ముందుగా వచ్చింది. ఈ నేపథ్యంలో సప్త నది సంగమేశ్వరం పశ్చిమ ద్వారం పీఠంపై ఏర్పాటు చేస్తున్న 5 టన్నులకు పైగా బరువు, ఐదు అడుగుల ఎత్తుతో భారీ నందీశ్వరుడి రాతి విగ్రహం ఏర్పాటయింది. దీని వెనుక ఆరు అడుగుల శ్రీ లలితా దేవి నిలబడి సప్త నదులను వీక్షిస్తూ .. ప్రతి కోసం .. సతి నిరీక్షిస్తున్నట్లు అమ్మవారి విగ్రహం, అమ్మవారి పాదాల చెంత 5 శివలింగాలు దర్శనమిస్తాయి.

ఈ సంవత్సరం ఆలయం జలాధివాసంలోకి వెళ్లేందుకు ఎగువ నుంచి కృష్ణమ్మ పరవళ్ళు ఇంకా మొదలు కాలేదు. వర్షా బావ పరిస్థితుల వల్ల శ్రీశైలం జలాశయానికి వరద నీరు జులై చివరి మాసం గడుస్తున్నా రాలేదు.

సప్త నది సంగమేశ్వర క్షేత్రంలో ఆగమ శాస్త్ర వాస్తు సంప్రదాయాన్ని అనుసరించి ఏర్పాటుచేసిన ఈ రాతి విగ్రహాలు క్షేత్రానికి.. తీర్థానికి నూతన శోభను తీసుకువచ్చింది. తొలి ఏకాదశి పర్వ దినాన ఈ విగ్రహాల పరివారానికి విశేష ఆరంభం క్రతువులు జరగనున్నాయి.

M Satya Peter, Atmakur (Karnool)

M Satya Peter, Atmakur (Karnool)

Next Story