Yanamala Ramakrishnudu: అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన మాజీ మంత్రి యనమల..

Yanamala Ramakrishnudu: తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అస్వస్థతతో కాకినాడ ట్రస్ట్ ఆస్పత్రిలో చేరారు.

Arun Chilukuri
Published on: 22 Oct 2026 2:23 PM IST
Yanamala Ramakrishnudu
X

Yanamala Ramakrishnudu: అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన మాజీ మంత్రి యనమల..

Yanamala Ramakrishnudu: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అస్వస్థతకు గురయ్యారు. హఠాత్తుగా అనారోగ్య సమస్య తలెత్తడంతో కుటుంబ సభ్యులు ఆయనను తక్షణమే కాకినాడలోని ట్రస్ట్ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల బృందం ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందిస్తోంది.

యనమల రామకృష్ణుడు ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. యనమల కుటుంబసభ్యులకు, ఆస్పత్రి వైద్యులకు ఫోన్ చేసి మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని, అందిస్తున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.

యనమల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని పార్టీ స్థానిక నాయకులను సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి సూచన మేరకు కాకినాడ ఎంపీ సానా సతీశ్ వెంటనే కాకినాడలోని ట్రస్ట్ ఆస్పత్రికి చేరుకున్నారు. యనమలను పరామర్శించి, చికిత్స అందిస్తున్న వైద్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.