Simhachalam: సింహాచలం చందనోత్సవం.. భక్తులకు ప్రసాదాల పంపిణీపై ఈఓ కీలక ఆదేశాలు!

Simhachalam: సింహాచలం చందనోత్సవ వేడుకల సందర్భంగా భక్తులకు అందజేసే ప్రసాదాలు, ఆహార నాణ్యత మరియు భద్రతపై ఆలయ ఈఓ జల్లేపల్లి వెంకట్రావు సమీక్ష నిర్వహించారు.

GOPI, PENDURTHI
Published on: 8 April 2026 9:07 PM IST
Simhachalam
X

Simhachalam: సింహాచలం చందనోత్సవం.. భక్తులకు ప్రసాదాల పంపిణీపై ఈఓ కీలక ఆదేశాలు!

Simhachalam: శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి చందనోత్సవ వేడుకలను పురస్కరించుకుని, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు మరియు స్వచ్ఛంద సంస్థల సేవలపై నేడు ఆలయ పరిపాలనా భవనంలో కార్యనిర్వహణ అధికారి జల్లేపల్లి వెంకట్రావు అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జీవీఎంసీ హెల్త్ డిపార్ట్‌మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్ ఫుడ్ సేఫ్టీ అధికారులు మరియు వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

​స్వచ్ఛంద సంస్థలు భక్తులకు పంపిణీ చేసే ఆహార పదార్థాల వల్ల క్యూ లైన్లకు ఎటువంటి ఆటంకం కలగకూడదు. ​భక్తులు కదులుతున్న సమయంలోనే పదార్థాలను పంపిణీ చేయాలి. పంపిణీ కోసం భక్తులను ఆపడం వల్ల లైన్లు జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ​ఆహార పదార్థాలు పంపిణీ చేసే ప్రాంతంలో పారిశుధ్య బాధ్యత సంబంధిత స్వచ్ఛంద సంస్థలదే.

​పారిశుధ్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే, సదరు సంస్థలను తక్షణమే అక్కడ నుండి పంపించివేయడం జరుగుతుందని ఈఓ తెలిపారు. ​ఫుడ్ సేఫ్టీ అధికారి చక్రవర్తి మాట్లాడుతూ, భక్తులకు అందించే ఆహారం వేడిగా ఉండాలని, ఫుడ్ పాయిజన్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ​సేవలో పాల్గొనే వాలంటీర్లు తప్పనిసరిగా గ్లౌజులు (Gloves) మరియు హెడ్ క్యాప్‌లు (Head Caps) ధరించాలి.

​జీవీఎంసీ అధికారి రాజారావు కుమార్ మాట్లాడుతూ, ప్రసాదాల పంపిణీలో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాస్టిక్ వస్తువులను వాడరాదని స్పష్టం చేశారు. ​కేవలం పర్యావరణహితమైన (Eco-friendly) వస్తువులను మాత్రమే వినియోగించాలని ఆదేశించారు. ​గోపాలపట్నం సిఐ సన్యాసినాయుడు మాట్లాడుతూ, పోలీసు శాఖ వద్ద ఉన్న జాబితా ప్రకారం అనుమతి పొందిన సంస్థల ప్రతినిధులను మాత్రమే స్టాల్స్ వద్దకు అనుమతిస్తామని తెలిపారు.

​వాహన పాసులు కూడా పోలీసుల వద్ద ఉన్న రికార్డుల ప్రకారం సరిచూసిన తర్వాతే అనుమతించబడతాయి. ​చందనోత్సవం రోజున భక్తులకు ఆహార పదార్థాల, ప్రసాదాల పేరుతో కొన్ని సంస్థలు బయట చందాలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయని ఈఓ తెలిపారు. ​భక్తుల నుండి చందాలు అడిగే సంస్థలపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ​ఈ సమావేశమునకు మెడికల్ డిపార్ట్మెంట్ డా:రామిరెడ్డి దేవస్థానం ఎస్ డి సి మధులత పర్యవేక్షణ అధికారి పాలూరి నర్సింగరావు స్వచ్ఛంద సంస్థల ఆర్గనైజర్లు పాల్గొన్నారు.

GOPI, PENDURTHI

GOPI, PENDURTHI

Next Story