Simhachalam: రేపే సింహాచల చందనోత్సవం.. అప్పన్న నిజరూప దర్శనం!
Simhachalam: రేపే సింహాచల అప్పన్న చందనోత్సవం. ఏడాదికి ఒక్కసారి మాత్రమే లభించే స్వామివారి నిజరూప దర్శనం కోసం దేవస్థానం సర్వం సిద్ధం చేసింది.
Simhachalam: రేపే సింహాచల చందనోత్సవం.. అప్పన్న నిజరూప దర్శనం!
Simhachalam: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి వార్షిక చందనోత్సవానికి దేవస్థానం, జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేశాయి. ఈ ఏడాది సుమారు 2లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు ధర్మకర్తల దర్శనం అనంతరం, 3:30నుండి సామాన్య భక్తులకు అనుమతి ఉంటుంది.
సాయంత్రం 6గంటల వరకు దర్శనాలు కొనసాగుతాయి. సొంత వాహనాలను కొండ కింద పార్కింగ్ చేయాలి. భక్తుల కోసం 90ఉచిత ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. సిటీ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి పర్యవేక్షణలో 2,800మంది పోలీసులతో భారీ భద్రత కల్పించారు.
డ్రోన్లు,సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉంటుంది. ఎండ దృష్ట్యా 200 పాయింట్ల వద్ద మజ్జిగ,తాగునీరు అందుబాటులో ఉంచారు. నిర్ణీత స్లాట్లలోనే రావాలి. మొబైల్ ఫోన్లకు అనుమతి లేదు.పాస్ ఉన్న వాహనాలనే కొండపైకి అనుమతిస్తారు. సందేహాల కోసం 0891-2954944 నంబర్‌ను సంప్రదించవచ్చు.




