Nandikotkur: పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలి.. ఎస్పీ ఆదేశం

Nandikotkur: నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS నందికొట్కూరు టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)
Published on: 18 April 2026 8:53 PM IST
Nandikotkur
X

Nandikotkur: పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలి.. ఎస్పీ ఆదేశం

Nandikotkur: నంద్యాల జిల్లా ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలోని నందికొట్కూరు టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ IPS శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రెండు స్టేషన్లకు సంబంధించి క్రైమ్ రివ్యూ నిర్వహించారు.

పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని, దర్యాప్తు, ముద్దాయిల అరెస్టు, NBW ల అమలులో ఆధునిక సాంకేతికతను వినియోగించాలని అధికారులను ఆదేశించారు. కేసుల పెండింగ్‌కు గల కారణాలను అడిగి తెలుసుకున్న ఎస్పీ, నేరం చేసిన వారికి శిక్ష పడేలా దర్యాప్తు చేయడం ద్వారా పోలీసులపై ప్రజల నమ్మకం పెంచాలన్నారు.

పోలీస్ స్టేషన్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ఫిర్యాదుదారులతో గౌరవంగా మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. PGRS ఫిర్యాదులు, CCTNS పనితీరుపై సిబ్బందితో చర్చించి పలు సూచనలు చేశారు.

నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడవద్దని స్పష్టం చేశారు. సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని కోరారు. మహిళల హక్కులు, చట్టపరమైన రక్షణ, మహిళా సాధికారితపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలకు వివరించాలని తెలిపారు.

గ్రామాల్లో ఐక్యత కోసం గ్రామసభలు నిర్వహించి గొడవలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు డీఎస్పీ రామంజి నాయక్, నందికొట్కూరు టౌన్, రూరల్ సర్కిల్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)

Iman Raju, Nandikotkur(Kurnool Dist)

Next Story