Pithapuram: పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలి.. పిఠాపురంలో హోమాలు
Pithapuram: ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స అనంతరం త్వరగా కోలుకోవాలని కోరుతూ పిఠాపురం పాదగయ క్షేత్రంలో జనసేన నాయకులు మృత్యుంజయ హోమం నిర్వహించారు.
Pithapuram: పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలి.. పిఠాపురంలో హోమాలు
Pithapuram: పిఠాపురం నియోజకవర్గం శాసనసభ్యులు& ఉపముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినాయకులు కొణిదల పవన్ కళ్యాణ్ శాస్త్ర చికిత్స జరిగిన నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకొని మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని, మహా పుణ్యక్షేత్రమైన శ్రీ ఉమా కుక్కుటేశ్వర దేవస్థానం (పాదగయ)లో మృత్యుంజయ హోమం, చండీ హోమం, రుద్రాభిషేకం పూజ కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు డిసిసిబి బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు,ఫైవ్ మాన్ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఓదురీ కిషోర్, పిఠాపురం జనసేన పార్టీ పట్టణ ఇంచార్జి డాక్టర్ చిక్కాల వరలక్ష్మి విచ్చేసారు. ముందుగా ఆ దేవదేవుని అమ్మవారీని దర్శనం చేసుకుని హోమో, రుద్రాభిషేకం పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఎంతోమందికి ఆదర్శమూర్తి మార్గదర్శి అయినటువంటి ఆయనకు ఆరోగ్యం సరిగా లేక శాస్త్ర చికిత్స జరిగినది దాని నుండి ఆయన త్వరగా కోలుకోవాలని మరల ప్రజాసేవకు రావాలని రాష్ట్రాన్ని ఊరిని అభివృద్ధి చేయాలని కోరుకోవడం జరిగిందన్నారు.
అనంతరం శ్రీపాద శ్రీవల్ల మహాసంస్థానంలో ఆర్.సౌజన్య కార్య నిర్వహణాధికారిణి వారి సమక్షంలో కొణిదెల పవన్ కళ్యాణ్ గోత్రనామాలతో ప్రత్యెక పూజలు మరియు హోమాలు చేయించారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు జనసైనికులు వీర మహిళలు అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు.




