Razole: రాజోలులో పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజలు
Razole: కోనసీమ జిల్లా రాజోలులో పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Razole
Razole: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రాజోలు శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పూజలు నిర్వహించగా, మామిడికుదురు శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి, రాజోలు ఇంచార్జి గొల్లపల్లి అమూల్య వేర్వేరు కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని, ప్రజా సేవలో తిరిగి చురుకుగా పాల్గొనాలని ప్రార్థించారు. ఆయన సేవలు ప్రజలకు అవసరమని, మరింత ఉత్సాహంతో ప్రజా సేవ కొనసాగించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమాల్లో గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్, గోదావరి డెల్టా ప్రాజెక్టు చైర్మన్ గుబ్బల శ్రీనివాస్, రాజోలు మండల జనసేన పార్టీ అధ్యక్షుడు సూరిశెట్టి శ్రీనివాస్, గుండాబత్తుల తాతాజీ, గుబ్బల రవి కిరణ్, బోణం చిన్న, కోళ్ల బాబి, ఉలిశెట్టి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.




