Polavaram: మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆధ్వర్యంలో గిరిజన సంక్షేమ శాఖ సమీక్ష
Polavaram: రిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో ఎస్టీ కమిటీ చైర్‌పర్సన్ మిరియాల శిరీషాదేవి జీవో-3 ప్రత్యామ్నాయంపై చర్చించారు.
Polavaram: మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆధ్వర్యంలో గిరిజన సంక్షేమ శాఖ సమీక్ష
పోలవరం: ఆదివాసీల మనోభావాలకు ఎలాంటి విఘాతం కలగ కుండా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్, ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి అన్నారు. అమరావతి గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో బుధవారం గిరిజనుల సంక్షేమంపై సమీక్షా సమావేశం మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆధ్వర్యంలో నిర్వహించారు.
గిరిజన సంక్షేమశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఎం. ఎం.నాయక్, గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు భార్గవిల సౌజనంలో జీవో నం 3కి ప్రత్యామ్నాయం పై గిరిజన సంఘాలు ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు గుమ్మడి సంధ్యారాణి, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్ ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి లు మాట్లాడుతూ జీవో నం.3 ను గత వైకాపా ప్రభుత్వం హయాంలో 2020లో సర్వోన్నత న్యాయస్థానం లో రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
దానిపై గత ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయలేదని తద్వారా ఆదివాసీలకు తీరని నష్టాన్ని మిగిల్చినట్లు పేర్కొన్నారు. ఆదివాసీల జీవన ప్రమాణాలు, విద్యా, ఉపాధి మార్గాలు కోసం జీవో నం 3ను తీసుకువచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం అన్నారు. సుమారు 20 సంవత్సరాల పాటూ గిరిజనులు నూరు శాతం ఉద్యోగ అవకాశాలు పొందారంటే దానికి కారణం తెలుగుదేశమే అన్నారు. కాగా సర్వోన్నత న్యాయస్థానం లో జీవో నం:3 ను రద్దు చేసినప్పుడు కూడా ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు జగన్ సర్కార్ కి లేఖ రాసినట్లు పేర్కొన్నారు. కానీ వైకాపా ప్రభుత్వం స్పందించడంలో విఫల మైనట్లు పేర్కొన్నారు.
కాగా ఇటీవల కాలంలో ఆదివాసీలు ఉద్యమాలు చేయటం పై సమీక్ష నిర్వహించి ప్రజలకు వాస్తవాలు తెలియ జేయాలని సూచించారు. గతంలో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో జీవో నం.3కి ప్రత్యామ్నాయంగా కసరత్తు చేస్తున్నట్లు, తద్వారా న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. న్యాయస్థానంలో కూడా ఎలాంటి చిక్కులు లేకుండా అన్ని విధాలుగా సక్రమంగా ఉండేలా న్యాయ నిపుణులతో చర్చించి ఆదివాసీలకు అండగా ఉంటామన్నారు.
1/70 చట్టం విషయంలో కూడా ఎలాంటి అపోహలకు పాల్పడొద్దని చట్టానికి వ్యతిరేకంగా ఎక్కడా నష్టం జరగదని పేర్కొన్నారు. బాక్సైట్ తవ్వకాలు విషయంలో కూడా గిరిజనుల అభిప్రాయాలకు ఎలాంటి విఘాతం కలగదని ప్రభుత్వం స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. సమీక్షా సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, గిరిజన శాసనసభ్యులుతో ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ అవకాశాలపై విస్తృతంగా చర్చించినట్లు పేర్కొన్నారు.
కార్యక్రమంలో శాసన సభ్యులు తోయక జగదేశ్వరి, ట్రైకర్ చైర్మన్ బి శ్రీనివాసులు, గిరిజన సహకార సంస్థ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్, రహదారులు భావనల శాఖ డైరెక్టర్ దొన్నుదొర , మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి , న్యాయవాది త్రినాథరావు, టి. బాబురావు నాయుడు, గిరిజన సంఘాల ప్రతినిధులు రామారావు, కుంజా శ్రీను పలువురు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.




