Chintoor: చింతూరులో ఎంపీటీసీ నామినేషన్ల పర్వం ప్రారంభం పోలీసుల డేగకన్ను

Chintoor: చింతూరు ఏజెన్సీలో ఎంపీటీసీ నామినేషన్ల వేళ ఎస్సై సంతోష్ కుమార్ పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఎంపీడీవో కార్యాలయం వద్ద నిఘా పెంచి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా చర్యలు.

RAJESH REDDY, CHINTOOR
Published on: 21 Oct 2026 12:23 PM IST
Chintoor
X

Chintoor: చింతూరులో ఎంపీటీసీ నామినేషన్ల పర్వం ప్రారంభం పోలీసుల డేగకన్ను

Chintoor: చింతూరు ఏజెన్సీలోని విలీన మండలాలలో ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల పర్వం ఊపందుకుంది.ఈ రోజు నుంచి అక్టోబర్ 23 వరకు నామినేషన్ల పర్వం కొనసాగనుంది.ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ ను వేసేందుకు రంగ సిద్ధం చేసుకున్నారు. స్థానిక సమరంలో ప్రధాన పార్టీ నాయకులు గెలుపు గుర్రాలను సిద్ధం చేసుకున్నారు.

ఈ స్థానిక సమరంలో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుని తమ హవా ను ప్రదర్శించాలని చూస్తున్నారు.ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చింతూరు ఎస్సై సంతోష్ కుమార్ గట్టి నిఘా, బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.శాంతి భద్రతలకు విఘతాం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ సంతోష్ కుమార్ హెచ్చరించారు.నామినేషన్ సెంటర్ అయిన చింతూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద నిఘా పటిష్టం చేశారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR