Gajuwaka: కరాటే బెల్ట్ టెస్టు పోటీలు.. విజేతలకు సర్టిఫికెట్ల ప్రదానం
Gajuwaka: గాజువాక ఉక్కునగరం క్లబ్ హాల్లో నిర్వహించిన జాతీయ కరాటే గ్రేడింగ్ పోటీల్లో సినీ హీరో సుమన్, బీజేపీ నేత కరణంరెడ్డి నరసింగరావు పాల్గొన్నారు.
Gajuwaka: కరాటే బెల్ట్ టెస్టు పోటీలు.. విజేతలకు సర్టిఫికెట్ల ప్రదానం
Gajuwaka: గాజువాక ఉక్కునగరం క్లబ్ హాల్లో భారత్ వొడాకాయ్ కరాటే డు అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు సిహెచ్ సతీష్ కుమార్ అధ్యక్షతన కరాటే గ్రేడింగ్ బెల్ట్ టెస్టు పోటీలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ హీరో మరియు మార్షల్ ఆర్ట్స్ అకాడమీ జాతీయ అధ్యక్షులు సుమన్ తల్వార్ గౌరవ అతిథిగా బిజేపి రాష్ట్ర మీడియా పేనలిస్ట్ గాజువాక ఇంచార్జ్ కరణంరెడ్డి నరసింగరావు పాల్గొన్నారు.
పలువురు క్రీడాకారులకు వైట్, గ్రీన్, ఆరెంజ్, పర్పిల్, యెల్లో, బ్లూ, బ్లాక్ బెల్టులను సర్టిఫికెట్లను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరాటే నేర్చుకోవడం ద్వారా ఆత్మ రక్షణకు దోహద పడుతుందన్నారు. కరాటే ద్వారా మంచి క్రమశిక్షణ కూడా అలవడుతుందని అన్నారు.
క్రీడలతో పాటు చదువులో కూడా రాణించాలని సూచించారు. కార్యక్రమంలో కరాటే అసోసియేషన్ ప్రదాన కార్యదర్శి అంబు,సీనియర్ కోచ్ రాము,గోవర్ధన్,అగస్త్య , నాయకులు బొత్స దిలీప్ కుమార్,రాజు,పుస్పారావు తదితరులు పాల్గొన్నారు.




