Sundipenta: ప్రభుత్వ గృహాల నేలమట్టం.. అధికారుల కళ్లు గప్పి భవంతుల నిర్మాణం!

Sundipenta: నంద్యాల జిల్లా సున్నిపెంటలో ప్రభుత్వ గృహాల కూల్చివేత, అక్రమ కట్టడాల కలకలం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 13 April 2026 2:29 PM IST
Sundipenta
X

Sundipenta: ప్రభుత్వ గృహాల నేలమట్టం.. అధికారుల కళ్లు గప్పి భవంతుల నిర్మాణం!

Sundipenta: శ్రీశైలం మండల కేంద్రమైన సున్నిపెంట గ్రామంలో హైకోర్టు ఉత్తర్వులు..జిల్లా కలెక్టర్ ఆదేశాలతో భూ ఆక్రమణలపై ఒకవైపు సమగ్ర సర్వే జరుగుతుండగా మరోవైపు ప్రభుత్వ లోయర్ టైపు గృహాలను ఇష్టానుసారంగా కూల్చివేసి స్థానికేతర్లు పెద్ద పెద్ద భవంతులను నిర్మిస్తున్నారు. శ్రీశైలానికి చెందిన పలువురు సుండిపెంటలో ప్రభుత్వ గృహాలను విచ్చలవిడిగా కొనుక్కొని వాటిని కూల్చివేస్తున్న పట్టించుకునే నాధుడే కరువయ్యాడు.

ఆంజనేయ స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ లో డీ టైపు 102 ప్రభుత్వ గృహాన్ని నేలమట్టం చేసి పెద్ద భవంతి నిర్మిస్తున్న జల వనరుల శాఖ అధికారులు అటుగా తొంగి చూసిన దాఖలాలు లేవు.సర్వే సిబ్బంది జల వనరుల శాఖ అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లిన కూడా వారు స్పందించకపోవటంపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి.జల వనరుల శాఖ క్యాంప్స్ అండ్ బిల్డింగ్స్ విభాగం అధికారులు లంచాలు మరిగి అక్రమ కట్టడాలకు అడ్డుకట్ట వేయట్లేదని ప్రజలు బహిరంగానే చర్చించుకుంటున్నారు.

ఎన్నో ఏళ్లుగా స్థానికంగా నివాసముండే సామాన్యులు గృహాలు నిర్మించుకుంటే అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టే అధికారులు ఎక్కడో బయట నుంచి వచ్చిన వ్యక్తులు యదేచ్చగా ప్రభుత్వ గృహాలను నేలమట్టం చేసి భవంతులు నిర్మిస్తున్న పట్టించుకోకపోవడంపై ప్రజా సంఘాల నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

అసలు సుండిపెంట గ్రామం ఇరిగేషన్ శాఖ వల్లనే గాడి తప్పి అక్రమ కట్టడాలకు నిలయంగా మారింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ కట్టడాలు, ప్రభుత్వ గృహాల నేలమట్టంపై పోలీస్ కేసులు నమోదు చేసి తగు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story