AP Local Body Elections: వైసీపీకి సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ.. ఏపీలో స్థానిక ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్!

AP Local Body Elections 2026: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

Arun Chilukuri
Updated on: 9 Oct 2026 3:43 PM IST
Supreme Court
X

Supreme Court: వైసీపీకి సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ.. ఏపీలో స్థానిక ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్!

AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 'సర్‌' (SIR - ఓటర్ల ప్రత్యేక సవరణ) ప్రక్రియ పూర్తయిన తర్వాతే స్థానిక ఎన్నికలు జరపాలంటూ వైసీపీ కోరిన విజ్ఞప్తిని అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఆ పార్టీ లేవనెత్తిన ఏ ఒక్క అంశాన్ని కూడా కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు.

ఏపీ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ప్రధాన గడవుతో కూడిన ధర్మాసనం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ పూర్తిగా సమర్థించింది. హైకోర్టు ఇచ్చిన సమయం ప్రకారం రాబోయే ఆరు వారాల్లోపు నోటిఫికేషన్‌ జారీ చేయడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది.

నోటిఫికేషన్ విడుదలయ్యే లోపు 'సర్‌' ప్రక్రియ పూర్తయితే ఆ కొత్త జాబితాను పరిగణలోకి తీసుకోవాలని, లేనిపక్షంలో పాత జాబితా ప్రకారమే ఎన్నికలను నిర్వహించుకోవచ్చని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఎన్నికల ప్రక్రియకు అడ్డంకులు సృష్టించడం అంటే ప్రజా ప్రయోజనాలను అడ్డుకోవడమేనని ధర్మాసనం ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.