Yetapaka: ఎటపాక టీడీపీలో సస్పెన్షన్ కలకలం!

Yetapaka: ఎటపాకలో కూటమి టికెట్ల కేటాయింపుపై పసుపు శ్రేణుల తిరుగుబాటు. పార్టీ సస్పెన్షన్ వేటుపై మండిపడ్డ సీనియర్ నాయకులు దొంతు మంగేశ్వరరావు, మువ్వ శ్రీనివాసరావు.

RAJESH REDDY, CHINTOOR
Published on: 1 Nov 2026 8:24 AM IST
Yetapaka
X

Yetapaka: ఎటపాక టీడీపీలో సస్పెన్షన్ కలకలం!

Yetapaka: పోలవరం జిల్లా ఎటపాక నియోజకవర్గంలో కూటమికి షాకిచ్చే పరిణామం చోటుచేసుకుంది. పార్టీ కోసం ప్రాణం పెట్టి పనిచేసిన నిజమైన కార్యకర్తలపై సస్పెన్షన్ వేటు వేయడంపై టీడీపీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. సస్పెండ్ అయిన దొంతు మంగేశ్వరరావు, మువ్వ శ్రీనివాసరావు, పాయం దేవిలు అధిష్టానం తీరుపై నిప్పులు చెరిగారు.

మాకు శిక్ష.. మమ్మల్ని వేధించిన వారికి పురస్కారమా ?

గతంలో వైసీపీ జడ్పీటీసీగా చెలరేగిపోయిన ఉబ్బ సుష్మిత.. టీడీపీ కార్యకర్తలను వేధింపులకు గురి చేసిందని, కేసులు పెట్టించిందని వారు ఆరోపించారు. అలాంటి వ్యక్తికి వైసీపీ కూడా టికెట్ ఇవ్వడానికి నిరాకరించి పక్కన పెడితే, కూటమిలో జనసేన టికెట్ ఎలా కట్టబెడతారని మండిపడ్డారు.

చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు రోడ్డెక్కి పోరాడింది మేము. వైసీపీ వేధింపులు భరించింది మేము. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక్కో టికెట్ పరిశీలించి ఇస్తామన్నారు. మరి టీడీపీ కార్యకర్తల కన్నీళ్లకు కారణమైన సుష్మితకు టికెట్ ఇచ్చేటప్పుడు ఆ పరిశీలన ఏమైంది? ఇది పవన్ కళ్యాణ్ గారికి తెలిసే జరిగిందా?.

లేక ఆయనకు తెలియకుండా తెరవెనుక ఎవరో నడిపిస్తున్నారా?" అంటూ సూటిగా ప్రశ్నించారు.ఎటపాకలో నిజమైన టీడీపీ జెండా మోసే పాయం దేవిని గెలిపించుకుని, సస్పెన్షన్ కు గుణపాఠం చెప్పి జడ్పీ హాల్లో అడుగుపెడతామని వారు సవాల్ విసిరారు. దీంతో ఎటపాక జడ్పీటీసీ పోరు కాస్తా కూటమి వర్సెస్ అసలైన టీడీపీ కార్యకర్తల మధ్య పోరుగా మారింది.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR