Cheepurupalli: ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛ ఆంధ్ర సాధ్యం.. పట్టాభిరాం
Cheepurupalli: చీపురుపల్లి లో నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరాం పాల్గొన్నారు.
Cheepurupalli: ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛ ఆంధ్ర సాధ్యం.. పట్టాభిరాం
Cheepurupalli: స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు చీపురుపల్లి నియోజకవర్గానికి విచ్చేసిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కొమ్మారెడ్డి పట్టాభిరాం కి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ కిమిడి రామా మల్లిక్ నాయుడు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా చైర్మన్ పట్టాభిరాం మాట్లాడుతూ..
“స్వచ్ఛ ఆంధ్ర సాధన కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ప్రజల భాగస్వామ్యంతో ప్రతి గ్రామం, పట్టణం పరిశుభ్రంగా మార్చుతాం” అని తెలిపారు.
టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కిమిడి రామా మల్లిక్ నాయుడు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గార్ల సారథ్యంలో స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర విజన్‌ను ప్రతి ఇంటికీ తీసుకెళ్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో చీపురుపల్లి నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




