Amaravati: నేటి నుంచే 'తల్లికి వందనం' నగదు జమ.. పోలీసుల అలర్ట్!
Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి తల్లికి వందనం పథకం నగదు జమ ప్రారంభం. 64 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13,000 జమ.
Amaravati: నేటి నుంచే 'తల్లికి వందనం' నగదు జమ.. పోలీసుల అలర్ట్!
Amaravati: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'తల్లికి వందనం' పథకం ఆర్థిక సాయం పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. నేటి నుంచి తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నగదు జమ కానుంది.
ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 64 లక్షలకు పైగా విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో ప్రతి ఒక్కరికి రూ.13,000 చొప్పున ప్రభుత్వం నేరుగా జమ చేయనుంది.
నగదు జమ అయ్యే ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు విజృంభించే అవకాశం ఉందని ఖాతా నంబర్, ఏటీఎం పిన్, ఓటిపి, ఆధార్ వివరాలను ఎవరికీ షేర్ చేయవద్దని రాష్ట్ర పోలీస్ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
Next Story




