TDP Mahanadu 2026: టీడీపీ 44వ మహానాడు ఏర్పాట్లు షురూ: మినీ మహానాడుల షెడ్యూల్ విడుదల!
TDP Mahanadu 2026: టీడీపీ 44వ మహానాడు వేడుకలకు రంగం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ మరియు పార్లమెంట్ స్థాయిల్లో మినీ మహానాడుల నిర్వహణకు పల్లా శ్రీనివాసరావు షెడ్యూల్ ఖరారు చేశారు.
TDP Mahanadu 2026: టీడీపీ 44వ మహానాడు ఏర్పాట్లు షురూ: మినీ మహానాడుల షెడ్యూల్ విడుదల!
TDP Mahanadu 2026: టీడీపీ 44వ మహానాడుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు మినీ మహనాడుల నిర్వహణకు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు షెడ్యూల్ విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈనెల 18, 19, 20న నియోజకవర్గ స్థాయి, 23, 24 తేదీల్లో పార్లమెంట్ స్థాయి మినీ మహానాడులను నిర్వహించాలని ఆదేశించారు.
ఈ మహానాడుల్లో చేసిన తీర్మానాలను కేంద్ర పార్టీ కార్యాలయానికి పంపించాలని పల్లా ఆదేశించారు. అసెంబ్లీ నియోజకవర్గ మినీ మహానాడుల్లో చేసిన తీర్మానాలను 21 నాటికి, పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి మినీ మహానాడుల్లో చేసిన తీర్మానాలను 24 నాటికి కేంద్ర పార్టీ కార్యాలయానికి పంపాలని ఆదేశించారు.
Next Story




