Chintoor: ఎన్నికల ప్రచారంలోకి రీఎంట్రీ ఇచ్చిన టీడీపీ నేత జమాల్ ఖాన్!

Chintoor: అనారోగ్యం నుంచి కోలుకుని ఎన్నికల ప్రచారంలోకి దిగిన చింతూరు మండల టీడీపీ అధ్యక్షుడు జమాల్ ఖాన్. ఐదు ఎంపీటీసీల పరిధిలో కూటమి అభ్యర్థుల తరఫున సుడిగాలి పర్యటన.

RAJESH REDDY, CHINTOOR
Published on: 1 Nov 2026 8:22 AM IST
Chintoor
X

Chintoor: ఎన్నికల ప్రచారంలోకి రీఎంట్రీ ఇచ్చిన టీడీపీ నేత జమాల్ ఖాన్!

Chintoor: చింతూరు మండల టీడీపీ అధ్యక్షుడు ఎండి. జమాల్ ఖాన్ అనారోగ్యం నుంచి కోలుకుని ఎన్నికల ప్రచారంలోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆయన రాకతోనే టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం పెల్లుబికింది.శనివారం నుంచి ప్రచారాన్ని హోరెత్తిస్తున్న జమాల్ ఖాన్.. మండలంలోని పెద్దసీతనపల్లి, మోతుగూడెం, కల్లేరు, తుమ్మల, చదలవాడ ఎంపీటీసీ పరిధిలోని గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు.

ప్రతి గ్రామంలో కూటమి జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ, పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రచారంలోకి దిగిన జమాల్ ఖాన్ పట్టుదలను చూసి కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR