P Gannavaram: పి.గన్నవరం టీడీపీలో గ్రూపు రాజకీయం.. తమ్ముళ్ల మధ్య ఘర్షణ!

P Gannavaram: అంబేద్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండల టీడీపీ సమావేశంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పార్టీ పదవుల ఎంపిక విషయంలో నాయకులు, కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో సమావేశం రసాభాసగా మారింది.

RAJU, P GANNAVARAM
Published on: 11 Jun 2026 7:39 AM IST
P Gannavaram
X

P Gannavaram: పి.గన్నవరం టీడీపీలో గ్రూపు రాజకీయం.. తమ్ముళ్ల మధ్య ఘర్షణ!

పి.గన్నవరం (అంబేద్కర్ కోనసీమ జిల్లా): పి. గన్నవరం మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మండల పార్టీ సమావేశం లో తెలుగు తమ్ముళ్ల మధ్య ఘర్షణ. మండల అధ్యక్షురాలు పత్తిపాటి ఉమామహేశ్వరి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో బూత్ కన్వీనర్లు, క్లస్టర్లు మండల తెలుగుదేశం పార్టీ పదవులు విషయంలో తెలుగు తమ్ముళ్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

గ్రామ శాఖ అధ్యక్షులతో చర్చించకుండా పదవుల విషయంలో ఇష్టరీతినా వ్యవహరిస్తు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని పి గన్నవరం మండల తెలుగుదేశం నాయకులు మండిపడుతున్నారు. పార్టీ సమావేశం జరుగుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మధ్య మాట మాట పెరగడంతో సమావేశం రసా బసగా మారింది.

పి గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో అంతర్గత కలహాలకు ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ లేకపోవడమే. గ్రామ శాఖలకు నాయకులకు సమాచారం ఇవ్వకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని. తెలుగు తమ్ముళ్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

RAJU, P GANNAVARAM

RAJU, P GANNAVARAM

Next Story