TDP: మెగా డీఎస్సీపై వైసీపీ దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్సీ
TDP: టీడీపీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర 16 వేల టీచర్ పోస్టుల మెగా డీఎస్సీపై వైసీపీ చేసిన ఆరోపణలను తిప్పికొట్టి, కొత్త డీఎస్సీపై ప్రకటన చేశారు.
TDP: మెగా డీఎస్సీపై వైసీపీ దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్సీ
TDP: డిఎస్సీ ని, టీచర్ పోస్టుల భర్తీని ద్వేషించే జగన్ కు, 16 వేల టీచర్ పోస్టులను ఒకేసారి భర్తీ చేసిన లోకేష్ ఎలా నచ్చుతాడు,తాను చేయలేకపోయిన పనిని సమర్థవంతంగా పూర్తి చేసిన నారా లోకేష్ ను రాజీనామా చేయాలని జగన్, వైసీపీ నేతలు కోరడం ఆశ్చర్యంగా ఉంది అంటూ ప్రశ్నించారు టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర.
మెగా డిఎస్సీ తో నిరుద్యోగుల కలలను నిజం చేసిన నాయకుడు నారా లోకేష్, మెగా డిఎస్సీ ను అడ్డుకునేందుకు కోట్లాది రూపాయలను కోర్టులకు ఖర్చు చేసిన నాయకుడు జగన్ అని అన్నారు.డీఎస్సీ పరీక్షలకు ముందు, ఆ తరువాత కూడా వైసీపీ ప్రోద్బలంతో కోర్టులలో పలు పిటిషన్లు దాఖలు చేశారని, వీటిపై ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన వాస్తవాలు, నిబంధనలను, ఆధారాలను పరిశీలించిన తర్వాత హైకోర్టు డీఎస్సీ నిర్వహణలో ఎటువంటి అక్రమాలు జరగలేదని పిటీషన్లు అన్ని కొట్టివేయడం జరిగిందని చెప్పారు.
డీఎస్సీ నిర్వహించి, టీచర్ పోస్టులు భర్తీ చేసి ఏడాది గడిచిన తర్వాత మరలా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని YSRCP ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని చెప్పారు.తమ ప్రభుత్వం లో నిర్వహించలేకపోయిన DSC లు, ఇవ్వలేకపోయిన ఉద్యోగాలు కూటమి ప్రభుత్వం చేసి చూపడంతో జగన్ జీర్ణించుకోలేక పోతున్నారని చెప్పారు.
పొంతన లేని పోలికలతో, ఆధారాలు లేని ఆరోపణలతో, DSC నిర్వహణపై కనీస అవగాహన లేని నేతలు నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారని, పెద్ద ఎత్తున జరిగిన టీచర్ పోస్టుల భర్తీ ని జగన్ ఓర్వలేక పోతున్నారని, డిఎస్సీ లో అవకతవకలు జరిగాయనే అబద్దాన్ని పదే పదే తమ నేతలతో చెప్పించి నిజం చేయాలని జగన్ తపన పడుతున్నారని చెప్పారు.
తాము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సీ వేస్తామని నిరుద్యోగులకు హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క టీచర్ పోస్టు ఖాళీగా లేదని జారుకున్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. డిఎస్సీ పై వైసీపీ నేతలు చేసిన నిరాధార ఆరోపణలను విద్యాశాఖాధికారులు ఎప్పటికప్పుడు నివృత్తి చేశారు, అయిననూ వైసీపీ దుష్ప్రచారం ఆపలేదు.
మెగా డిఎస్సీ పై అవకతవకలు జరిగాయని, వాటిపై విచారణ జరపాలని కోరుతూ వైసీపీ నేతలు వేసిన పిల్ ను హైకోర్టు కొట్టివేస్తూ, ఇటీవల తీర్పు ఇచ్చిందని, కానీ వైసీపీ నేతల తీరులో మాత్రం ఎలాంటి మార్పు లేదని చెప్పారు. టీచర్ పోస్టులు సాధించినవారిని మానసిక క్షోభకు గురి చేయడం తో పాటు, రాబోయే డిఎస్సీ ని ఏదో రకంగా అడ్డుకుని నిరుద్యోగులను భయాందోళనలకు గురి చేయడమే లక్ష్యంగా వైసీపీ నేతలు పని చేస్తున్నారని చెప్పారు. విద్యాశాఖా మంత్రిగా రాష్ట్రంలో విప్లవాత్మక విద్యా సంస్కరణలకు శ్రీకారం చుట్టిన నాయకుడు నారా లోకేష్, యేటా జాబ్ కేలండర్ ను వారు ప్రకటించి నిరుద్యోగులలో భరోసా నింపుతున్నారని చెప్పారు.
ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ మెగా డిఎస్సీ ఇచ్చిందని, త్వరలో మరో డిఎస్సీ ఇవ్వనున్నది కూటమి ప్రభుత్వమేనని....ఎవరెన్ని కుట్రలు చేసినా, విష ప్రచారం చేసినా ఉద్యోగాల భర్తీ ఆగదని స్పష్టం చేశారు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర.




