Regidi: సెగలు రేపుతున్న ఇసుక తవ్వకాలు.. రైతుల నిరసన!
Regidi: శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం నాగావళి నదిలో ఇసుక తవ్వకాలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Regidi: సెగలు రేపుతున్న ఇసుక తవ్వకాలు.. రైతుల నిరసన!
Regidi: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం కందిశ–తునివాడ గ్రామాల మధ్య నాగావళి నదిలో ఇసుక తవ్వకాలపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నదిలో కొందరు వ్యక్తులు యంత్రాల సహాయంతో ఇసుక తవ్వకాలు చేపట్టేందుకు ప్రయత్నించడంతో స్థానిక రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ తవ్వకాల వల్ల నది లోతు పెరిగి, నదికి ఆనుకుని ఉన్న రేగిడి బట్టి ప్రాంతానికి నీటి ప్రవాహం తగ్గిపోతుందని రైతులు చెబుతున్నారు. దీంతో సుమారు 10 గ్రామాలకు చెందిన రైతులకు సాగునీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇసుక రాంపు వద్ద సుమారు 200 మంది రైతులు గుమిగూడి నిరసన చేపట్టారు. అక్రమంగా ఇసుక తవ్వకాలు జరగకుండా తక్షణమే నిలిపివేయాలని, రాంపు నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేస్తున్నారు.
స్థానిక అధికార యంత్రాంగం వెంటనే స్పందించి పరిస్థితిని సమీక్షించి, రైతుల సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.




