Chintoor: చింతూరు అటవీ ప్రాంతంలో పశువులపై పెద్దపులి దాడి.. ఒక పశువు మృతి!

Chintoor: పోలవరం జిల్లా చింతూరు రేంజ్ గుల్లేటివాడ అటవీ ప్రాంతంలో పశువులపై పెద్దపులి దాడి. ఒక పశువు మృతి, మరొకదానికి తీవ్ర గాయాలు.

RAJESH REDDY, CHINTOOR
Published on: 28 Oct 2026 12:42 PM IST
Chintoor
X

Chintoor: చింతూరు అటవీ ప్రాంతంలో పశువులపై పెద్దపులి దాడి.. ఒక పశువు మృతి!

Chintoor: చింతూరు అటవీ రేంజ్ పరిధిలోని గుల్లేటివాడ అటవీ ప్రాంతంలో రెండు పశువుల పై మంగళవారం రాత్రి పులి దాడి చేసింది.ఈ దాడిలో ఒక పశువు మృతి చెందగా, మరో పశువు తీవ్రంగా గాయపడింది.గత మూడు రోజుల క్రితం పెద్దపులి గోదావరి నది దాటి పాపికొండల అటవీ ప్రాంతంలోకి ప్రవేశించింది.

అక్కడ నుండి విఆర్ పురం అటవీ రేంజ్ పరిధిలో తిరుగుతూ మంగళవారం చింతూరు అటవీ శాఖ రేంజ్ లోకి ప్రవేశించింది.మంగళవారం రాత్రి రెండు గంటలకు పులి టేకులూరు అటవీ ప్రాంతంలో ఉన్నట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు.బుధవారం ఉదయం పెద్దపులి చదలవాడ అటవీ ప్రాంతంలో ప్రవేశించినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు.

పెద్దపులి చింతూరు ఏజెన్సీ అటవీ ప్రాంతంలో సంచరించుతుండడంతో స్థానికులు భయందోళనకు గురవుతున్నారు.పెద్దపులి వలన ఏ సమయంలో ఎటువంటి ముప్పు వాటిల్లుతుందోనని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR