Nellore: జాతీయ రహదారిపై రక్తపాతం.. గొర్రెల మందను ఢీకొన్న టిప్పర్!
Nellore: నెల్లూరు జిల్లా కలువాయి సమీపంలో జాతీయ రహదారి 565పై ఘోర ప్రమాదం. టిప్పర్ దూసుకెళ్లి 30 గొర్రెలు మృతి. 5 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని కాపరుల ఆవేదన.
Nellore: జాతీయ రహదారిపై రక్తపాతం.. గొర్రెల మందను ఢీకొన్న టిప్పర్!
Nellore: నెల్లూరు జిల్లా మెట్ట ప్రాంతంలోని నెంబర్ 565 జాతీయ రహదారి రక్త మోడింది. కలువాయి నుండి అనంతసాగరం మండలం ఉప్పలపాడు గ్రామానికి తోలుకొని మాగాణి వైపు మేత కోసం వెళుతుండగా వెంకటరెడ్డిపల్లి వద్ద జాతీయ రహదారిపై ఓ టిప్పర్ గొర్రెల మంద పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 30కి పైగా గొర్రెలు అక్కడకక్కడే మృత్యువాత పడ్డాయి. మరి కొన్నింటికి తీవ్ర గాయాలు పాలయ్యాయి.
ఉయ్యాలపల్లికి చెందిన కాపరులు అనంతసాగరం మండలం ఉప్పలపాడుకు గొర్రెలను మేత కోసం తోలుకెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. పెద్ద ఎత్తున గొర్రెలు ప్రమాదంలో మృత్యువాత పట్టడంతో గొర్రెల కాపరులు లబోదిబోమంటూ అల్లాడిపోతున్నారు. ప్రమాదంలో దాదాపు 5 లక్షల పైగా విలువైన గొర్రెలు మృత్యువాత పడ్డాయని,
బాధిత గొర్రెల యజమానులు రొండ్ల నగేష్, నాలి సుధాకర్ లు కన్నీరు మున్నీరవుతున్నారు ప్రమాద సమాచారాన్ని తెలుసుకున్న కలవాయి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గొర్రెల మంద పైకి దూసుకెళ్లిన టిప్పర్ను అదుపుల్లోకి తీసుకున్నారు. ప్రమాదంపై విచారణ చేపట్టారు.




