Tirumala: వజ్రాలు, నీలాలు, పుష్యరాగాలతో అద్భుత ఆకృతులు.. శ్రీవారికి భక్తుడు సమర్పించిన 121 కిలోల నగల లిస్ట్ చూశారా?

Tirumala: ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో వర్ధమాన్ జైన్ దంపతులు తిరుమల శ్రీవారికి అందించిన రూ.207.6 కోట్ల విలువైన 121 కిలోల బంగారు ఆభరణాల (46 రకాలు) పూర్తి జాబితా వివరాలు ఇక్కడ చూడండి.

Arun Chilukuri
Published on: 26 Nov 2026 5:15 PM IST
Tirumala
X

Tirumala: వజ్రాలు, నీలాలు, పుష్యరాగాలతో అద్భుత ఆకృతులు.. శ్రీవారికి భక్తుడు సమర్పించిన 121 కిలోల నగల లిస్ట్ చూశారా?

Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి చెన్నైకి చెందిన పారిశ్రామికవేత్త వర్ధమాన్ జైన్ దంపతులు సమర్పించిన అపురూప బంగారు ఆభరణాల పూర్తి వివరాలను టీటీడీ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో స్వామివారికి సమర్పించిన ఈ కానుక మొత్తం విలువ రూ.207.6 కోట్లు కాగా, బరువు 121 కిలోలు. ఇందులో శ్రీవారి కోసం 106 కిలోల బంగారంతో 46 రకాల ఆభరణాలు, శ్రీ పద్మావతీ అమ్మవారి కోసం 15 కిలోల బరువైన బంగారు వస్త్రాన్ని ప్రత్యేకంగా తయారు చేయించారు.

శ్రీవారి ఆభరణాలుగా 106 కిలోల బంగారం

• శ్రీ పద్మావతీ అమ్మవారికి 15 కేజీల బరువైన వస్త్రం

• బంగారు పాద కవచములు -3

• బంగారు అందెలు -3

• బంగారు పాకడాలు

• బంగారు తులసిపాత్ర హారం

• బంగారు అష్టోత్తర కాసుల మాల

• బంగారు చతుర్భుజ లక్ష్మీ హారం

• బంగారు పులిగోరు

• బంగారు అశ్వథ పాత్ర హారము

• బంగారు సాదా వడ్డాణము

• బంగారు గంటల మొలతాడు

• బంగారు సూర్యకటారి

• బంగారు కౌస్తుభం

• బంగారు శ్రీవత్సం

• బంగారు మోచేయి

• బంగారు కటి హస్తం

• బంగారు నాగాభరణ వడ్డాణము

• బంగారు గోపు

• బంగారు ఐదు పేటల కంఠీలు 5

• బంగారు చంద్రవంకీ కంఠీ

• బంగారు వైకుంఠ హస్తము

• బంగారు కటి హస్తము

• బంగారు నాగాభరణ కడియాలు 4

• బంగారు భుజ కీర్తులు 3

• బంగారు కర్ణపత్రములు 3

• బంగారు భావళీలు -3

• బంగారు సాలిగ్రామ హారములు- 3

• బంగారు కమలం తరహా సాలిగ్రామాలు 3

• బంగారు మోపుగల యజ్ఞోపవీతం

• బంగారు శంఖ కవచము

• బంగారు చక్ర కవచము

• బంగారు కిటీపు ముఖపట్టి

• బంగారు కిరీటము

• 2,427 కేరట్ల బరువున్న నీలాలు, పుష్యరాగం, కెంపులు, పచ్చలతో శ్రీవత్సం పతకం

• 238.2 కేరట్ల బరువున్న వజ్రాలను పొదిగిన ఆభరణాలు

తితిదే చరిత్రలోనే ఒకే భక్తుడు ఇంత భారీ స్థాయిలో, ఇన్ని రకాల ఆభరణాలను సమర్పించడం విశేషంగా నిలిచింది.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.