Udayagiri: బస్సుల్లో భద్రతా పరికరాల తనిఖీ.. నిబంధనలపై సీరియస్

Udayagiri: నెల్లూరు జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల భద్రతా ప్రమాణాలను పరిశీలించడంతో పాటు వాహనదారులకు హెల్మెట్ ధరించాలని పోలీసులు అవగాహన కల్పించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 12 April 2026 8:35 PM IST
Udayagiri
X

Udayagiri: బస్సుల్లో భద్రతా పరికరాల తనిఖీ.. నిబంధనలపై సీరియస్

Udayagiri: ఉదయగిరిలో ట్రాఫిక్ నియమాల అమలుపై పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. జాతీయ రహదారి 167BGపై వాహనాలను ఆపి పరిశీలించిన పోలీసులు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణించాలని సూచించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని అవగాహన కల్పించారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడపవద్దని హెచ్చరించారు.

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను కూడా తనిఖీ చేసిన పోలీసులు వాహనాలకు సంబంధించిన పత్రాలు సక్రమంగా ఉన్నాయా, భద్రతా పరికరాలు ఉన్నాయా అన్న విషయాలను పరిశీలించారు. బస్సుల్లో ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు, ఎమర్జెన్సీ సదుపాయాలు ఉన్నాయా అనే అంశాలను కూడా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరావు, ఎస్సై ఇంద్రసేనారెడ్డి తమ సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. ప్రజల భద్రత కోసమే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story