UK Job Fraud Case: విదేశీ ఉద్యోగాల మోసం కేసు.. యూట్యూబర్ రమానందనపై మరో కేసు

UK Job Fraud Case: యూకేలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేసి మోసం చేసిన కేసులో బిగ్‌బాస్ కంటెస్టెంట్ రమానందనకు అద్దంకి పోలీసులు నోటీసులు అందజేశారు.

Arun Chilukuri
Published on: 12 Sept 2026 11:08 AM IST
UK Job Fraud Case
X

UK Job Fraud Case: విదేశీ ఉద్యోగాల మోసం కేసు.. యూట్యూబర్ రమానందనపై మరో కేసు

UK Job Fraud Case: యూకేలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ మోసానికి పాల్పడిన కేసులో నిందితురాలైన రమానందనకు అద్దంకి పోలీసులు శుక్రవారం నోటీసులు అందజేశారు. సీఐ సుబ్బరాజు వెల్లడించిన వివరాల ప్రకారం.. అద్దంకి మండలం పేరాయపాలేనికి చెందిన ఉప్పలపాటి శ్రీనివాసరావు తన కోడలికి యూకేలో ఉద్యోగం కోసం 2023లో గుంటూరులో ప్రైవేటు కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న రమానందన మామ జె.మోహనరావును సంప్రదించారు. తొలి విడతగా అడ్వాన్స్ రూపంలో రూ.లక్ష చెల్లించగా.. పత్రాలన్నీ పూర్తయ్యాక మరో రూ.9.60 లక్షలు అందజేశారు.

అయితే ఎంత కాలం గడిచినా ఉద్యోగం రాకపోగా, అడిగిన డబ్బులు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో బాధితుడు ఈ ఏడాది జూన్‌లో అద్దంకి పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కన్సల్టెన్సీ నిర్వాహకులు జె.మోహనరావు, భార్య ఝాన్సీలక్ష్మి, కుమారుడు మధుకర్, కోడలు రమానందనతో పాటు ఆమె తల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రస్తుతం యూకే పౌరసత్వం కలిగి ఉన్న రమానందన.. బిగ్‌బాస్ షో ఎంపికల నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేయగా, శుక్రవారం ఆమె తన న్యాయవాదితో కలిసి అద్దంకి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి నోటీసులు అందుకున్నట్లు సీఐ తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.