CII Partnership Summit 2026: "చంద్రబాబు నా పెద్దన్న".. విశాఖ సదస్సులో పీయూష్ గోయల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
CII Partnership Summit 2026: విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026లో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
CII Partnership Summit 2026: "చంద్రబాబు నా పెద్దన్న".. విశాఖ సదస్సులో పీయూష్ గోయల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
CII Partnership Summit 2026: విశాఖపట్నంలో అట్టహాసంగా ప్రారంభమైన 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026లో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు.
చంద్రబాబు నాయుడు తన పెద్ద అన్నయ్య లాంటివారని, గత 20 సంవత్సరాలుగా ఆయనతో కలిసి పనిచేయడాన్ని ఎంతో ఆనందించానని పీయూష్ గోయల్ గుర్తుచేసుకున్నారు. విశాఖపట్నం తనకు సొంతిల్లు లాంటిదని, భవిష్యత్తులో సీఐఐ భాగస్వామ్య సదస్సుకు విశాఖే శాశ్వత వేదికగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం పవిత్ర కార్తిక మాసంలో భక్తులు ఆచరించే దీపదానాన్ని ఈ సందర్భంగా పీయూష్ గోయల్ ప్రస్తావించారు. ఒక దీపం మరో దీపాన్ని వెలిగించడం ద్వారా తన కాంతిని కోల్పోదని, ఇతరులకు వెలుగునిస్తుందని తెలిపారు. ఇదే భాగస్వామ్యానికి అసలైన అర్థమని, పరస్పర సహకారంతో భారత్ వాణిజ్య రంగంలో ఎదుగుతోందని ఆయన పేర్కొన్నారు.
గతంలో విశాఖ నగరంలో తుఫానులు భారీ నష్టాన్ని కలిగించేవని గుర్తుచేసిన పీయూష్ గోయల్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో, సీఎం చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన పాలన వల్ల ఏపీ విపత్తులను ఎదుర్కొనే బలమైన స్థితిస్థాపకతను సంతరించుకుందని కొనియాడారు. ఇటీవల అక్టోబర్ 28, నవంబర్ 3 తేదీల్లో వచ్చిన తుఫానులను సమర్థవంతంగా ఎదుర్కొన్న వైనాన్ని ఆయన ప్రశంసించారు.




