Vizag: ప్రపంచ శాంతి కోసం వాసుపల్లి గణేష్ కుమార్ శాంతియాత్ర

Vizag: అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం తొలగిపోవాలని కోరుతూ విశాఖ దక్షిణ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ శాంతియాత్ర చేపట్టారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 8 April 2026 5:24 PM IST
Vizag
X

Vizag: ప్రపంచ శాంతి కోసం వాసుపల్లి గణేష్ కుమార్ శాంతియాత్ర

Vizag: పచ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని విశాఖ దక్షిణ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా - ఇరాన్ ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అమెరికా మంగళవారం రాత్రి దేశాన్ని తుడిచిపెడతానని బెదిరించడం విచారకర్మన్నారు.

ఆయన నిర్ణయంలో మార్పు రావాలని కోరుతూ వాసుపల్లి గణేష్ కుమార్ మంగళవారం రాత్రి పాత నగరం శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో కొబ్బరికాయ కొట్టి ఆసీలమెట్ట శ్రీ సంపత్ వినాయక ఆలయం వరకు చెప్పులు లేకుండా కాలినడకన వైసిపి శ్రేణులతో కలిసి శాంతియాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ ఒక దేశాన్ని నాశనం చేయడం అంటే అది ప్రపంచ వినాశనమే అని చెప్పారు. తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని ఇతర దేశాలను బెదిరిస్తూ అమెరికా తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుందని మండిపడ్డారు.

రష్యా దగ్గర అమెరికా గంట ఎక్కువ అణ్వాయుధాలు ఉన్నాయని ఈ సందర్భంగా తెలిపారు. అలాగే చైనా వద్ద కూడా ఉన్నాయని చెప్పారు. అణుయుద్ధం అంటూ వస్తే ప్రపంచం వినాశనమవుతుందని పేర్కొన్నారు. ఇరాన్ తమ షరతులకు ఒప్పుకోకపోతే ఆ దేశం పై అణు దాడి చేస్తామని బెదిరించడం దారుణమన్నారు. ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకొని ఈ యుద్ధాన్ని ఆపాలని కోరుతూ తాను ఈ పాదయాత్ర చేస్తున్నట్లు వాసుపల్లి వెల్లడించారు.

★ పది రోజుల కాల్పులు విరమణ..

మంగళవారం రాత్రి వాసుపల్లి గణేష్ కుమార్ ట్రంప్ నిర్ణయంలో మార్పు రావాలని కోరుతూ చేసిన పాదయాత్ర ఫలించిందని వైసీపీ క్యాడర్ సంతోషం వ్యక్తం చేసింది. బుధవారం ఉదయం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ పై దాడి చేసే ప్రయత్నాన్ని విరమించుకుని పది రోజుల కాల్పుల విరమణ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేయడం జరిగింది. భవిష్యత్తులో ఈ యుద్ధం ఒక ముగింపు రావాలని ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ కోరారు.

ప్రపంచంలో శాంతి నెలకొనేలా ప్రపంచ దేశాధినేతలు అందరూ ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమం లో జిల్లా జనరల్ సెక్రటరీ గనగల రామరాజు,వార్డ్ ప్రెసిడెంట్స్ పీతల వాసు, ముజీబ్ ఖాన్,జిల్లా RTI సెక్రెటరీ ఆరుగుల రాజు, జిల్లా యూత్ జనరల్ సెక్రెటరీ చంద్రమౌళి, సౌత్ అనుబంధ సంఘాల ప్రెసిడెంట్లు బాబ్జి, దైవ కుమార్, వీటి కృష్ణ కుమార్, వార్డ్ యూత్ ప్రెసిడెంట్లు చేపల నూకరాజు బూరెల చిన్న, లోకేష్,ఉదయ్,మౌళి తదితరులు పాల్గున్నారు

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story