Chandrababu: నెరవేరిన 30 ఏళ్ల కల.. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభంపై చంద్రబాబు సంచలన పోస్ట్!
Chandrababu: వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభోత్సవంపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు.
Chandrababu: నెరవేరిన 30 ఏళ్ల కల.. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభంపై చంద్రబాబు సంచలన పోస్ట్!
Chandrababu: పశ్చిమ ప్రకాశం ప్రాంత రూపురేఖలను మార్చే పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన పోస్ట్ చేశారు. 30 ఏళ్ల క్రితం తాను తీసుకున్న సంకల్పం ఇప్పటికి నెరవేరిందని, ఎన్నో అవాంతరాలు, సవాళ్లను అధిగమించి కరవు నేలకు కృష్ణమ్మ జలాలను అందించబోతున్నామని ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు.
1996 మార్చి 5న వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన తానే.. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఈనెల 31న ఫేజ్-1ను ప్రారంభించబోతున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ సందర్భంగా శంకుస్థాపన నాటి అరుదైన ఫొటోను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈనెల 31న 10.7 టీఎంసీల నీటిని నల్లమల సాగర్‌కు విడుదల చేయనున్నట్లు తెలిపారు.
ఫేజ్-1 ద్వారా 1.19 లక్షల ఎకరాలకు, ఫేజ్-2 ద్వారా 3.283 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. ప్రాజెక్టు ద్వారా లక్షలాది మందికి ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇస్తూ స్వచ్ఛమైన తాగునీరు అందించి ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు.
రాయలసీమ, ఉమ్మడి ప్రకాశం జిల్లాలను రూ. లక్ష కోట్ల పెట్టుబడులతో హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. బెంగళూరు-అమరావతి హైవే, రామాయపట్నం పోర్టు అందుబాటులోకి రావడం వల్ల ఈ ప్రాంతంలో వాణిజ్య, పారిశ్రామిక అవకాశాలు మరింత పెరుగుతాయని సీఎం వివరించారు.




