Nellore: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి మత్స్యకార సమాఖ్య వినతి
Nellore: నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని మత్స్యకార సంఘాల నాయకులు కలిశారు.
Nellore: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి మత్స్యకార సమాఖ్య వినతి
Nellore: మత్స్యకారుల సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి. ఈ మేరకు మంగళవారం నెల్లూరులోని విపిఆర్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ సంఘాల సమాఖ్య నేతలు కలిసి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి పలు అంశాలపై వినతి పత్రం అందజేశారు.
తీరంలోని అనేక సమస్యలను పరిశీలించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే దిశగా సమాఖ్య ప్రయత్నం చేస్తోందన్నారు. రాష్ట్రంలో 14 మత్య్సకార ఉపకులాలో ఒక కులమైన పట్టపు సామాజిక వర్గానికి రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ సంఘాల సమాఖ్య సంపూర్ణ మద్దతు తెలిపినట్లు వివరించారు. ఈ సందర్భంగా పలు అంశాలను ఎంపీ వేమిరెడ్డి దృష్టికి తీసుకువచ్చారు.
బోట్ల విషయంలో శాశ్వత పరిష్కారం కొరకు తమిళనాడు, పాండిచ్చేరి ప్రభుత్వాలతో రాష్ట్ర ప్రభుత్వం చర్చించి ఆ బోట్లు రాకుండా ఇరు రాష్ట్రాల బోట్ల అసోసియేషన్‌తో చర్చలు జరపాలన్నారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ అందుబాటులో ఉన్న నేపథ్యంలో స్థానిక మత్యకారులకు 50 బోట్లు కొనుగోలుకు 20% సబ్సిడికి ప్రత్యేక నిధులు మంజూరు చేయవలసినదిగా కోరారు. రామాయపట్నం పోర్టుకి అనుబంధంగా వస్తున్న బి.పి.సి.యల్,
ఇండోసోల్ సోలార్ వంటి పరిశ్రమలలో స్థానిక మత్సకారులకు 45% ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. అంతేకాక కలుషిత జలాలు పరిశ్రమల వారు సముద్రంలో కలవకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. మత్సకారుల సముద్ర వేటకు ఉపయోగపడే నది ముఖ ద్వారాలలో పూడిక తీత పనులు ప్రారంభించేలా చూడాలన్నారు.
సుమారు 2.50 లక్షల జనాభా కలిగిన పట్టపు సామాజిక వర్గానికి పట్టపు కార్పోరేషన్ ఏర్పాటు చేసేలా ప్రయత్నించాలన్నారు. ఎంపీని కలిసిన వారిలో ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు అర్జున్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల ముత్యాలు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆవుల వాసు, జిల్లా అధ్యక్షులు వావిళ్ల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.




