విజయవాడ వాసులకు సూపర్ గుడ్ న్యూస్.. ఇక ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే.!

Vijayawada Traffic Relief: విజయవాడలో ట్రాఫిక్ కష్టాలు పడుతున్నారా? అయితే మీకు ఒక గుడ్ న్యూస్..

Ravi
By Ravi
Published on: 30 May 2026 8:45 PM IST
విజయవాడ వాసులకు సూపర్ గుడ్ న్యూస్.. ఇక ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే.!
X

Vijayawada Traffic Relief: విజయవాడలో ట్రాఫిక్ కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ముఖ్యంగా నిడమానూరు, ఎనికేపాడు, రామవరప్పాడు జంక్షన్లలో రోజూ ప్రయాణించాలంటే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకోవాల్సిందే. బైపాస్ రోడ్డు అందుబాటులో ఉన్నా సరే, టోల్ ప్లాజా ఫీజులు తప్పించుకోవడానికి భారీ వాహనాల డ్రైవర్లు కావాలని సిటీ లోపల నుంచే వచ్చేస్తుంటారు. దీనివల్ల ఆ రూట్ లో నిత్యం ట్రాఫిక్ జామ్స్, రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఆఫీసులకు, స్కూళ్లకు వెళ్లే సామాన్యులకు ఇది రోజూ ఎదురయ్యే పెద్ద నరకం. అయితే, ఈ ట్రాఫిక్ కష్టాలకు ఒక శాశ్వత పరిష్కారం లభించేలా ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది.

అదే నిడమానూరు డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్. విజయవాడ ట్రాఫిక్ కష్టాలను పూర్తిగా తీర్చడానికి గతంలో నిడమానూరు దగ్గర ఈ ఫ్లై ఓవర్ నిర్మించాలని అధికారులు ప్లాన్ చేశారు. కానీ అప్పట్లో మెట్రో రైలు ప్రతిపాదనలు తెరమీదకు రావడం వల్ల దాదాపు వెయ్యి కోట్లతో నిర్మించాల్సిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును కాస్తా పక్కన పెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఈ ఆగిపోయిన ప్రాజెక్టు కు ప్రాణం పోసే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు.. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఈ ఫ్లై ఓవర్ ఆవశ్యకత గురించి గట్టిగా వివరించారు. వెంటనే స్పందించిన సీఎం, కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి ఈ ట్రాఫిక్ సమస్యను పూర్తిగా వివరించారు. దానికి ఆయన కూడా సానుకూలంగా స్పందించడం బెజవాడ వాసులకు నిజంగా శుభవార్తే.

ఈ నేపథ్యంలోనే ఫ్లై ఓవర్ పనులను ముందుకు తీసుకెళ్లడానికి ఏపీ రోడ్లు, భవనాల శాఖ స్పెషల్ సెక్రటరీ, కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ సెక్రటరీకి ఒక లేఖ రాశారు. ఈ ఒక్క అడుగుతో డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ నిర్మాణం మళ్లీ పట్టాలెక్కినట్లే అని ప్రభుత్వ అధికారులు బలంగా భావిస్తున్నారు. ఈ డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ పూర్తయితే నగరంలోకి వచ్చే భారీ వాహనాల రద్దీ పూర్తిగా తగ్గుతుందని విజయవాడ వాసులు భావిస్తున్నారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story