Anakapalli: బొగ్గు ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత.. మూసివేయాలని ప్రజల ధర్నా!
Anakapalli: అనకాపల్లి మండలం పిసినికాడలో బొగ్గు ఫ్యాక్టరీ కాలుష్యంపై గ్రామస్థుల మహా ధర్నా. మహాలక్ష్మి వెల్మన్ కంపెనీని మూసివేయాలని డిమాండ్.
Anakapalli: బొగ్గు ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత.. మూసివేయాలని ప్రజల ధర్నా!
Anakapalli: బొగ్గు ఫ్యాక్టరీని మూసివేయాలని పెద్ద ఎత్తున ప్రజలు అనకాపల్లి మండలం పిసిని కాడ పంచాయతీ పరిధిలో గల బిఆర్టి కాలనీలో ఉన్న మహాలక్ష్మి వెల్మన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ (బొగ్గు ఫ్యాక్టరీ) ఆవరణలో పెద్ద ఎత్తున పేటియం మూసివేయాలని గ్రామ ప్రజలు నినాదాలు చేశారు. దీనిపై ప్రభుత్వ అధికారులు స్పందించి పొల్యూషన్ బోర్డ్ ఫ్యాక్టరీస్ అధికారులు వచ్చి అక్కడ ప్రజలు చేస్తున్న ధర్నాని పర్యవేక్షించారు.
గ్రామ ప్రజలు మాట్లాడుతూ ఈ బొగ్గు ఫ్యాక్టరీ ద్వారా గ్రామంలో చాలా మంది సంబంధిత వ్యాధులతో బాధపడుతూ వాటర్ కూడా పొల్యూషన్ అయిందని తెలిపారు. దీనిపై అధికారులు వెంటనే స్పందించి ఫ్యాక్టరీ మూసివేయాలని తెలిపారు. అధికారులు బుధవారం నాడు విశాఖపట్నం పొల్యూషన్ బోర్డ్ ఆఫీసులో మీటింగ్ లో మీ సమస్యలను తెలియపరిస్తే వెంటనే దాన్ని ఉన్నంత అధికారులకు తెలియపరిచి ఫ్యాక్టరీ పై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అధికారులు ఇచ్చిన హామీని గ్రామ ప్రజలు శిరసా వహించారు. దీంతో గ్రామ ప్రజల శాంతించి ధర్నాని విరమించుకున్నారు. ఈ ధర్నాకి సంఘీభావం తెలిపిన అనకాపల్లి వైఎస్ఆర్సిపి నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ విచ్చేసి ధర్నాలో పాల్గొన్న ప్రజలకు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొన్నారు.




