Palnadu: వినుకొండలో ఘోర విషాదం.. ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య!
Palnadu: పల్నాడు జిల్లా వినుకొండ గ్రామీణ మండలంలో ఘోర విషాదం. కుటుంబ కలహాల తట్టుకోలేక ఇద్దరు చిన్నారులకు విషమిచ్చి చంపి, ఆపై తల్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
Palnadu: వినుకొండలో ఘోర విషాదం.. ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య!
Palnadu: కుటుంబ కలహాలు, భర్త నిర్లక్ష్యం ఒక నిండు సంసారంలో తీరని విషాదాన్ని నింపాయి. పచ్చని సంసారంలో రేగిన గొడవలు ముగ్గురి ప్రాణాలను బలితీసుకున్నాయి. పల్నాడు జిల్లా వినుకొండ గ్రామీణ మండలం విఠంరాజుపల్లి గ్రామంలో ఒక తల్లి తన ఇద్దరు చిన్నారులను చంపి, తాను కూడా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. విఠంరాజుపల్లికి చెందిన నక్కా భారతి (24) అనే మహిళకు సునీల్‌రెడ్డితో వివాహమైంది. ఈ దంపతులకు తేజేష్‌రెడ్డి (6), హేమనాథ నాగి రెడ్డి (4) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. సునీల్‌రెడ్డి స్థానికంగా పాల వ్యాను డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, కొంతకాలంగా దంపతుల మధ్య తీవ్ర మనస్పర్థలు తలెత్తడంతో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయి.
ఆదివారం రాత్రి భర్త సునీల్‌రెడ్డి రోజువారీలాగే విధులకు వెళ్ళాడు. ఇంట్లో పిల్లలతో ఒంటరిగా ఉన్న భారతి తీవ్ర మనస్తాపానికి లోనైంది. ఈ క్రమంలోనే అర్ధరాత్రి సమయంలో తన ఇద్దరు కుమారులకు విషం ఇచ్చి దారుణంగా హతమార్చింది. అనంతరం ఆమె కూడా ఇంట్లోనే ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది.
భర్త సునీల్‌రెడ్డి కొంతకాలంగా చెడు వ్యసనాలకు బానిసయ్యాడని, సంపాదనంతా వాటికే తగలేస్తూ కుటుంబ పోషణను పూర్తిగా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. భర్త తీరు మారకపోవడం, రోజువారీ గొడవలతో విసిగిపోయిన భారతి.. పిల్లల భవిష్యత్తుపై ఆందోళనతో ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.




