Weather Update: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. వాతావరణ శాఖ హెచ్చరిక
Weather Update: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఉత్తర ఒడిశా - పశ్చిమ బెంగాల్ తీరాలపై కేంద్రీకృతమై ఉంది.
Weather Update: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. వాతావరణ శాఖ హెచ్చరిక
Weather Update: ఉత్తర ఒడిశా - పశ్చిమ బెంగాల్ తీరాలకు దూరంగా వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం తీవ్రరూపం దాల్చుతోంది. విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. ఈ అల్పపీడన ద్రోణి ప్రస్తుతం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై స్థిరంగా కేంద్రీకృతమై ఉంది.
ఇది సముద్ర మట్టానికి సుమారు 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి, తీవ్ర వాయుగుండంగా మారేందుకు అనుకూల వాతావరణం ఏర్పడింది. రాబోయే 2 రోజులలో ఈ అల్పపీడనం మరింత బలపడి, తీవ్ర అల్పపీడనంగా మారి ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ మీదుగా వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు.
మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.




