CII Partnership Summit 2026: విశాఖలో పెట్టుబడుల పండుగ.. సీఐఐ భాగస్వామ్య సదస్సు లైవ్ అప్డేట్స్..!
CII Partnership Summit 2026: విశాఖలో సీఐఐ భాగస్వామ్య-2026 సదస్సు ప్రారంభమైంది.
CII Partnership Summit 2026: విశాఖలో పెట్టుబడుల పండుగ..
CII Partnership Summit 2026: విశాఖలో సీఐఐ భాగస్వామ్య-2026 సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సుకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సదస్సు ప్రాంగణానికి చేరుకున్న కేంద్రమంత్రి, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు వివిధ కళాకారుల బృందం ఘన స్వాగతం పలికింది.
Live Updates
- 12 Nov 2026 1:05 PM IST
చంద్రబాబు నా పెద్దన్న: పీయూష్ గోయల్
విశాఖపట్నంలో అట్టహాసంగా ప్రారంభమైన 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026లో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు.
చంద్రబాబు నాయుడు తన పెద్ద అన్నయ్య లాంటివారని, గత 20 సంవత్సరాలుగా ఆయనతో కలిసి పనిచేయడాన్ని ఎంతో ఆనందించానని పీయూష్ గోయల్ గుర్తుచేసుకున్నారు. విశాఖపట్నం తనకు సొంతిల్లు లాంటిదని, భవిష్యత్తులో సీఐఐ భాగస్వామ్య సదస్సుకు విశాఖే శాశ్వత వేదికగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
- 12 Nov 2026 12:55 PM IST
పెట్టుబడులు, మ్యానుఫ్యాక్చరింగ్‌కు ఏపీ కేరాఫ్ అడ్రస్.. విశాఖ సీఐఐ సదస్సులో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులు, తయారీ (Manufacturing) మరియు ఆవిష్కరణలకు (Innovation) దేశంలోనే ప్రముఖ గమ్యస్థానంగా నిలుస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. విశాఖపట్నంలో అట్టహాసంగా జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు.
- 12 Nov 2026 12:51 PM IST
ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ అసాధారణ ప్రగతి సాధిస్తోంది.. విశాఖ సీఐఐ సదస్సులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్!
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అద్భుతమైన పరివర్తనను చవిచూస్తోందని, ప్రపంచ వేదికలపై భారత్ ఒక బలమైన గొంతుకగా ఎదగడమే కాకుండా ప్రపంచ నిర్ణయాలను ప్రభావిత చేసే స్థాయికి చేరుకుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. విశాఖపట్నంలో అట్టహాసంగా జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు.
- 12 Nov 2026 12:46 PM IST
పర్యాటక రంగాన్ని 'గ్రోత్ ఇంజిన్'గా మారుస్తాం.. విశాఖ సీఐఐ సదస్సులో మంత్రి కందుల దుర్గేష్!
విశాఖలో జరుగుతున్న సీఐఐ (CII) పార్ట్నర్షిప్ సమ్మిట్‌కు హాజరైన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్
సదస్సు వేదిక వద్ద మంత్రి కందుల దుర్గేష్‌కు ఘన స్వాగతం పలికిన ఉన్నతాధికారులు
ఏపీ పర్యాటక రంగంలో భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తామని ధీమా వ్యక్తం చేసిన మంత్రి దుర్గేష్
గడిచిన రెండున్నరేళ్లలో రూ.20000 కోట్ల పర్యాటక పెట్టుబడును ఆకర్షించామని దాదాపు పదివేల కోట్లు గ్రౌండింగ్ చేశామని మంత్రి దుర్గేష్ వెల్లడి
పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతుల కల్పనే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి దుర్గేష్ స్పష్టీకరణ
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పర్యాటక రంగం అత్యంత కీలకమైన ఆదాయ వనరుగా మారనుందని మంత్రి దుర్గేష్ వెల్లడి
యువతకు ఉపాధి కల్పన, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి పర్యాటక రంగాన్ని 'గ్రోత్ ఇంజిన్'గా మారుస్తామని కందుల దుర్గేష్ ఉద్ఘాటన
- 12 Nov 2026 12:44 PM IST
సాగర తీరంలో పెట్టుబడుల సందడి.. 58 దేశాల ప్రతినిధులతో కళకళలాడుతున్న విశాఖ సీఐఐ సదస్సు!
విశాఖ నగరంలో ఘనంగా ప్రారంభమైన 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు 2026
• నేవిగేటింగ్ ద న్యూ వరల్డ్ ఆర్డర్ థీమ్ తో సదస్సును ప్రారంభించిన భారత పరిశ్రమల సమాఖ్య
• సదస్సును ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి పీయుష్ గోయెల్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
• సీఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరైన కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్, మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్ధన్ రెడ్డి
• భాగస్వామ్య సదస్సులో పాల్గొన్న పారిశ్రామిక వేత్తలు గ్రంథి మల్లిఖార్జునరావు, కియా ఇండియా ఎండీ సీఈఓ గ్వాంగ్ లీ, సుచిత్రా ఎల్లా, సీఐఐ అధ్యక్షుడు, టాటా కెమికల్స్ సీఈఓ ఆర్ ముకుందన్ తదితరులు
• సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొనేందుకు తరలి వచ్చిన 58 దేశాలకు చెందిన ప్రభుత్వ, పారిశ్రామిక ప్రతినిధులు, భారత్ లో విదేశీ రాయబారులు
- 12 Nov 2026 12:42 PM IST
కళాకారులను ఉత్సాహపరిచిన నేతలు
విశాఖపట్నంలో ప్రతిష్టాత్మక సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026 అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
సదస్సు ప్రాంగణానికి చేరుకున్న కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లకు సంప్రదాయ కళాకారుల బృందం ఘన స్వాగతం పలికింది.




