CII Partnership Summit 2026: ఆ రోజు ఐటీ.. నేడు ఏఐ.. చంద్రబాబు విజన్‌పై రామ్మోహన్ నాయుడు ప్రశంసలు!

CII Partnership Summit 2026: విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రసంగించారు.

Arun Chilukuri
Published on: 12 Nov 2026 1:27 PM IST
CII Partnership Summit 2026
X

CII Partnership Summit 2026: ఆ రోజు ఐటీ.. నేడు ఏఐ.. చంద్రబాబు విజన్‌పై రామ్మోహన్ నాయుడు ప్రశంసలు!

CII Partnership Summit 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులు, తయారీ (Manufacturing) మరియు ఆవిష్కరణలకు (Innovation) దేశంలోనే ప్రముఖ గమ్యస్థానంగా నిలుస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. విశాఖపట్నంలో అట్టహాసంగా జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కొత్త విషయాలను నేర్చుకునే 'ఎటర్నల్ స్టూడెంట్' అని రామ్మోహన్ నాయుడు అభివర్ణించారు. 1990లలోనే ఐటీ విప్లవం గురించి మాట్లాడిన చంద్రబాబు, నేడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్వాంటమ్ టెక్నాలజీ వంటి నెక్స్ట్-జెన్ టెక్నాలజీలపై దృష్టి సారించారని కొనియాడారు. భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ముందే ఊహించి, దానికి తగినట్లుగా ప్రణాళికలు రచించి అమలు చేసే అసాధారణ నాయకుడు చంద్రబాబు అని ప్రశంసించారు.

ప్రధాని నరేంద్ర మోదీ మార్గదర్శకత్వం, సీఎం చంద్రబాబు నాయుడు అనుభవం, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పట్టుదల, మంత్రి నారా లోకేష్ చొరవతో ఏపీలో బలమైన 'డబుల్ ఇంజిన్ ప్రభుత్వం' పనిచేస్తోందని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. పరిశ్రమల ఏర్పాటు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, ప్రభుత్వమే స్వయంగా బాధ్యత తీసుకొని వాటిని గ్రౌండింగ్ చేసేలా సరికొత్త పాలనా విధానాన్ని తీసుకువచ్చామని తెలిపారు. 'అభివృద్ధి' అనేదే ఎన్డీఏ ప్రభుత్వ ప్రధాన డీఎన్ఏ మంత్ర అని ఆయన ఉద్ఘాటించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.