Nellore: నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బర్త్ డే వేడుకల సందడి!

Nellore: నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.

V. Narasimhulu, Nellore
Published on: 19 April 2026 3:52 PM IST
Nellore
X

Nellore: నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బర్త్ డే వేడుకల సందడి!

Nellore: పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యకర్తలు అభిమానులు కుటుంబ సభ్యుల మధ్య సంతోషంగా సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వేమిరెడ్డి దంపతులు ఇరువురు పాల్గొన్నారు. అభిమానులు తెచ్చిన భారీ కేక్ కట్ చేసి అభిమానుల మధ్య తమ సంతోషాన్ని వెలిబుచ్చారు.

ఈ సందర్భంగా కోవూరు ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల అభిమానం చూస్తుంటే తనకు మాటలు రావడంలేదని, తమను ఇంతగా అభిమానించే ప్రజలకు మరింత సేవ చేసే భాగ్యం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువనేత నారా లోకేష్ బాబులు తమకు కల్పించారని చెప్పారు.

మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పనిచేస్తామని, ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటామని చెప్పారు.

పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ..

వెల్లువెత్తిన ప్రజల అభిమానాన్ని చూస్తుంటే.. చాలా సంతోషంగా ఉందని, తాము ఎప్పుడూ రాజకీయాలలో హుందాగా ఉంటామని, బడుగు బలహీన వర్గాలకు భరోసాగా ఉంటామని చెప్పారు. తమ మీది నమ్మకంతో ఉన్నత పదవులు కట్టబెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కి యువనేత నారా లోకేష్ బాబులకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పారు. కార్యకర్తలకు ప్రజలకు అండగా ఉంటామని ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని చెప్పారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story