Kota Rukmini: ఎవరీ కోట రుక్మిణి?.. పవన్ కల్యాణ్ విడాకుల తర్వాత హాట్ టాపిక్!
Kota Rukmini: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విడాకుల ప్రకటన తర్వాత జనసేన నాయకురాలు కోట రుక్మిణి పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
Kota Rukmini: ఎవరీ కోట రుక్మిణి?.. పవన్ కల్యాణ్ విడాకుల తర్వాత హాట్ టాపిక్!
Kota Rukmini: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరియు అన్నా లెజ్నెవా పరస్పర అంగీకారంతో విడిపోతున్నారంటూ వార్తలు అధికారికంగా వెలువడిన తర్వాత సోషల్ మీడియాలో సరికొత్త చర్చ ప్రారంభమైంది. ప్రధానంగా జనసేన పార్టీలో కీలక నాయకురాలిగా గుర్తింపు పొందిన కోట రుక్మిణి పేరు నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. పార్టీలో ఆమె బాధ్యతలు ఏమిటి, ఆమె ప్రయాణం ఎలా సాగింది అనే అంశాలపై నెటిజన్లు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.
ఎవరీ కోట రుక్మిణి?కృష్ణా జిల్లాకు చెందిన కోట రుక్మిణిగారు గతంలో లండన్‌లో స్థిరపడి అక్కడ ఒక ప్రముఖ బ్రాండెడ్ బిజినెస్ ని నిర్వహించేవారు. పవన్ కల్యాణ్ విదేశీ పర్యటనలకు వెళ్లిన సమయంలో ఆయన కార్యక్రమాల నిర్వహణలో ఆమె కీలక పాత్ర పోషించారని వార్తలు ఉన్నాయి. రాజకీయాల పట్ల ఉన్న ఆసక్తితో 2020లో జనసేన పార్టీలో చేరిన ఆమెకు పవన్ కల్యాణ్ ‘జనసేన సెంట్రల్ అఫైర్స్ కమిటీ వైస్ ఛైర్మన్’ పదవిని కట్టబెట్టారు. 2022లో ఆమె తన నివాసాన్ని లండన్ నుంచి హైదరాబాద్‌కు మార్చుకుని పూర్తిస్థాయిలో పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనడం ప్రారంభించారు. పార్టీలో 'వీరమహిళ' విభాగాన్ని మరింత బలోపేతం చేయడంలో కూడా ఆమె పాత్ర ఉందని చెబుతుంటారు.
సచివాలయం ఘటనతో వెలుగులోకి..గతంలో ఏపీ రాజధాని అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతున్న సమయంలో కోట రుక్మిణి సచివాలయానికి రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. తొలుత భద్రతా సిబ్బంది ఆమెను అడ్డుకున్నప్పటికీ, పవన్ కల్యాణ్ ఛాంబర్ నుండి సంకేతాలు వెళ్లడంతో ఆమెను లోపలికి అనుమతించారు. నాటి నుండి సోషల్ మీడియాలో ఆమె గురించి రకరకాల చర్చలు నడుస్తూ వచ్చాయి.
విడాకుల వార్తల తర్వాత మళ్లీ హాట్ టాపిక్జనసేన వర్గాల్లో నాదెండ్ల మనోహర్ తర్వాత అంతటి ప్రాధాన్యత ఉన్న నాయకురాలిగా కోట రుక్మిణికి పేరు ఉందనే ప్రచారం ఉంది. ఇప్పుడు పవన్ కల్యాణ్ విడాకుల వార్తలు అధికారికంగా బయటకు రావడంతో, పాత సంఘటనలు, పార్టీలో ఆమె వహిస్తున్న కీలక పాత్రను రీ-కోట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఆమె ఫోటోలు, వీడియోలను నెటిజన్లు విపరీతంగా షేర్ చేస్తున్నారు.




