Bobbili: నమ్మించి ముంచేసింది.. కోటిన్నరతో మహిళ జంప్.. బాధితుల ఆందోళన!

Bobbili: బొబ్బిలి మండలం ఎం.బూర్జవలసలో గేదెల పుణ్యవతి అనే మహిళ 60 మందిని నమ్మించి రూ. 1.50 కోట్లతో పరార్.

P SRINIVASARAO,	BOBBILI
Published on: 15 April 2026 3:44 PM IST
Bobbili
X

Bobbili: నమ్మించి ముంచేసింది.. కోటిన్నరతో మహిళ జంప్.. బాధితుల ఆందోళన!

Bobbili: బొబ్బిలి మండలం ఎం.బూర్జవలసకు చెందిన గేదెల పుణ్యవతి అదే గ్రామానికి చెందిన 60మంది నుంచి రూ. 1,కోటి 50లక్షల వరకు అప్పులు చేసి పరార్ అయింది. గేదెల పుణ్యవతి ఒకరికి తెలియకుండా ఇంకొకరి వద్దకు వెళ్లి మీ డబ్బులకు నా ఆస్తి హామీ నేను ఎక్కడికి వెళ్ళి పోతాను మీ మధ్యన ఉన్నదాన్నే కదా అని అందర్నీ నమ్మించి ఎండనక వాననక కష్టపడిన,

కూలీ డబ్బులు కూడబెట్టి దాచుకున్న డబ్బులు తీసుకున్న పుణ్యవతి అప్పులు తీసుకుని పరార్ కావడంతో అప్పులు ఇచ్చిన వారంతా లబోదిబో అంటున్నారు. వారంతా పుణ్యవతి డబ్బులు అప్పు తీసుకొని సంతకం పెట్టి ఇచ్చిన ప్రామిసర్ నోటులతో వారంతా పోలీసులకు పిర్యాదు చేసేందుకు బుధవారం బొబ్బిలి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

P SRINIVASARAO,	BOBBILI

P SRINIVASARAO, BOBBILI

Next Story