Malikipuram: మలికిపురంలో ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం: హెన్రీ డ్యూనాంట్ సేవలు చిరస్మరణీయం!

Malikipuram: మలికిపురంలో ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా హెన్రీ డ్యూనాంట్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. రెడ్ క్రాస్ సభ్యుడు జంపన బుజ్జిరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డ్యూనాంట్ సేవలను స్మరించుకున్నారు.

PRABHU, RAZOLE
Published on: 8 May 2026 8:51 PM IST
Malikipuram: మలికిపురంలో ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం: హెన్రీ డ్యూనాంట్ సేవలు చిరస్మరణీయం!
X

మలికిపురం: రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడు హెన్రీ డ్యూనాంట్ జన్మదినం మే 8 ని ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి గుర్తించిందని జిల్లా రెడ్ క్రాస్ సభ్యులు జంపన బుజ్జిరాజు పేర్కొన్నారు. మలికిపురంలో జంపన బుజ్జిరాజు నివాసం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో డ్యూనాంట్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...1828 మే 8 న జెనీవాలో జన్మించిన హెన్రీ డ్యూనాంట్ వ్యాపారం నిమిత్తం1859లో ఇటలీలో పర్యటించిన సమయంలో ఇటలీ,అల్బేనియా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో గాయపడిన వారిని చూసి చలించిపోయి తన సేవలను ప్రారంభించినట్లు తెలిపారు. తదనంతరం యుద్ధ సమయాల్లో, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన వారి సహాయార్ధం 1863 లో సేవలు అందించేందుకు రెడ్ క్రాస్ సంస్థ ను ప్రారంభించారన్నారు.హెన్రీ డ్యూనాంట్ ను 1901 లో నోబెల్ సంస్థ తొలి నోబెల్ బహుమతి అందించి గౌరవించిందన్నారు.

తదనంతరం భారత దేశం తో పాటు ప్రపంచ వ్యాప్తంగా రెడ్ క్రాస్ సేవలు విస్తరించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సభ్యులు అల్లూరి మధురాజు, బోనం రాజు, రేవు జ్యోతి,తాడి సహదేవ్, గిడుగు తాతాలు, పల్లపోతు జైదీప్,మెజీషియన్ జానకి రామరాజు,హోమియో సుబ్రహ్మణ్యం, సలాది మూర్తి, పితాని ఏసు, రాపాక చిన్ని, చల్లా నాగరాజు, నడింపల్లి సుబ్బరాజు, గునిశెట్టి సతీష్ లతో పాటు పలువురు ప్రముఖులు, వివిధ గ్రామాల ప్రజలు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story