ఆపరేషన్ విజయవంతం కోలుకుంటున్నానన్న వైఎస్ షర్మిల
YS Sharmila: ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత వచ్చింది.
ఆపరేషన్ విజయవంతం కోలుకుంటున్నానన్న వైఎస్ షర్మిల
YS Sharmila: ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత వచ్చింది. ఇటీవల ఆమెకు వైద్యులు ఉదర శస్త్ర చికిత్స విజయవంతంగా నిర్వహించారు. ఈ సర్జరీ అనంతరం ప్రస్తుతం ఆమె వేగంగా కోలుకుంటున్నట్లు స్వయంగా వైఎస్ షర్మిల ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు.
శ్రేయోభిలాషులకు, మద్దతుదారులకు కృతజ్ఞతలు..
ఈ క్లిష్ట సమయంలో తన ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రతి ఒక్కరికీ షర్మిల ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అందరి ఆత్మీయత, ప్రార్థనలు, మరియు అండదండలు తనకు కొండంత బలాన్ని నిలిచాయని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే పూర్తిగా కోలుకుని ప్రజల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ప్రజలు , ఇతర రాజకీయ నాయకులు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షలను వ్యక్తం చేస్తున్నారు.




